శుభ‌వార్త : గ్రామ స‌చివాల‌యాల ఉద్యోగుల‌కు జ‌గ‌న్ కానుక !

-

గ్రామ మ‌రియు వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌ను పాల‌న‌లో మ‌రింత భాగ‌స్వామ్యం చేసే విధంగా వీరికి ఎంపీడీఓ స్థాయి అధికారులు మ‌రింత‌గా వెన్నుద‌న్నుగా నిలిచి, మంచి ప‌నితీరు రాబ‌ట్టుకునే విధంగా ఏపీ స‌ర్కారు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముందు నిర్ణ‌యించిన ప్ర‌కార‌మే జీతాల‌కు సంబంధించి రెగ్యుల‌రైజేష‌న్ కు సంబంధించి ఓ ప్ర‌క‌ట‌నను విడుద‌ల చేసేందుకు స‌మాయ‌త్తం అవుతోంది. ఇప్ప‌టికే జిల్లాల‌లో సంబంధిత వివ‌రాల న‌మోదు ప్ర‌క్రియ ఇవాళ్టి నుంచి ఆరంభం అయింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ప్రొబేష‌న్ పీరియ‌డ్-ను డిక్లైర్ చేస్తూనే బేసిక్ శాల‌రీ, ఇత‌ర అల‌వెన్సుల‌కు సంబంధించి ఇవాళ ఏపీ స‌ర్కారు ఓ కార్లిఫికేష‌న్ ఇచ్చింద‌ని తెలుస్తోంది. దీంతో జాబ్ రెగ్యుల‌రైజేష‌న్ కు సంబంధించి అర్హ‌త సాధించిన వారికి కొత్త పే స్కేలు జూలై నుంచి వ‌ర్తించ‌నున్నారు అని తెలుస్తోంది. ల‌క్షా 17 మంది ఉద్యోగుల‌లో స‌గానికి పైగా ఉద్యోగులు రెగ్యుల‌ర్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఆ మేర‌కు ప్ర‌భుత్వం కొన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. పాల‌నలో కీల‌క విభాగంగా భావిస్తున్న గ్రామ మ‌రియు వార్డు సచివాల‌యాల ప‌నితీరు మెరుగు ప‌ర్చేందుకు ఈ త‌ర‌హా నిర్ణ‌యాలు మేలు చేయ‌నున్నాయి. అదేవిధంగా ఎంద‌రో నిరుద్యోగుల‌కు ఓ ఆస‌రాగా ఇవి మారిన నేప‌థ్యంలో ఉద్యోగ భ‌ద్ర‌త వీరికి మ‌రింత ల‌భించ‌నుంది. అంతా డీఎ స్సీ ద్వారా వ‌చ్చినందున భ‌విష్య‌త్-లో వీరి జాబ్ రెగ్యుల‌ర్ అయితే మ‌రింత‌గా వీరు ప్ర‌భుత్వానికి సేవ‌లు అందించేందుకు అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ముందుగా నిర్ణ‌యించిన ప్రకారం జూన్ 10న వేత‌నాల‌కు సంబంధించి ఓ క్లారిఫికేష‌న్ రావడంతో సంబంధిత ఉద్యోగులు ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

ఎప్ప‌టి నుంచో జాబ్ రెగ్యురైజేష‌న్ కోసం ప‌ట్టుబ‌డుతున్న గ్రామ స‌చివాల‌య ఉద్యోగులకు జ‌గ‌న్ స‌ర్కారు కానుక ఇచ్చింది. వారి బేసిక్ శాల‌రీని ఫిక్స్ చేసింది. డీఏ, హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకుని గ్రాస్ : 29,202 రూపాయ‌లుగా, నెట్ శాల‌రీ 25,401 రూపాయ‌లుగా ఫిక్స్ చేసింది. దీంతో సంబంధిత ఉద్యోగులు ఆనందం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. వాస్త‌వానికి జీతాల పెంపు విష‌య‌మై ఎప్ప‌టి నుంచో ఉద్యోగులు ప‌ట్టుప‌డుతూ ఉన్నారు. జీతాల‌తో పాటు త‌మ‌కు ఉద్యోగ భ‌ద్ర‌త‌నిస్తూ, వీలున్నంత మేర‌కు జాబ్ ను రెగ్యుల‌ర్ చేయాల‌ని వీరు కోరుతున్నారు. డిపార్ట్మెంట‌ల్ టెస్టులు ఇప్ప‌టికే కండ‌క్ట్ చేసిన ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ రెగ్యుల‌రైజేష‌న్ పై విధివిధానాలు రూపొందించే ప‌నిలో ప‌డింది. అంద‌రినీ కాక‌పోయినా ఎగ్జామ్ పాస్ అయిన వారికి, మిగిలిన పెర్ఫార్మెన్స్ ఓరియెంటేష‌న్ ప్ర‌కారం జాబ్ ను రెగ్యుల‌రైజ్ చేయాల‌ని చూస్తోంది. అదేవిధంగా ప‌ని ఒత్తిడి కార‌ణంగా, వీరికి ఎప్లాయ్మెంట్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) ను కూడా ఎప్లై చేయాల‌ని భావిస్తోంది. ఇవ‌న్నీ కూడా ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారుకు తీసుకుంటున్న సానుకూల నిర్ణ‌యాలు. రాజ‌కీయ ఒత్తిళ్లు త‌గ్గిస్తే వీరు మ‌రింతగా ప‌నిచేసే అవ‌కాశాలే మెండు.

AP గ్రామ సచివాలయ ఉద్యోగుల కొత్త వేతనాలు

PRC                   2022

BASIC PAY         22460

DA                     4496

HRA                   2246

GROSS             29202

DEDUCTIONS

CPS                    2696

APGLI                   650

PT.                       200

EHS                     225

GIS.                      30

———              3801

NET                   25401

Read more RELATED
Recommended to you

Latest news