టీఢీపీ : లోకేశ్ ను హీరో చేస్తున్న జ‌గ‌న్ !

-

అధికార పార్టీలో ఉన్న వైసీపీ త‌ప్పిదాలు దిద్దుకోవ‌డం లేదు అన్న‌ది ఓ విమ‌ర్శ. త‌ప్పులు సరిదిద్దుకోకపోగా కొత్త త‌ప్పులు చేస్తోంది. మ‌రియు త‌ల‌నొప్పులు తెచ్చుకుంటోంది. అన్నా క్యాంటీన్ల‌ను ఆ రోజు ఆపేసిన లేదా  నిలుపుద‌ల చేసిన వైసీపీ స‌ర్కారు త‌రువాత  కాలంలో వీటిని గ్రామ స‌చివాల‌యాలుగా మార్చేసింది. అయిన‌ప్ప‌టికీ టీడీపీ నాయ‌కులు మాత్రం తాను అనుకున్న‌ది సాధించే తీరుతామ‌ని అంటున్నారు. ప్ర‌తిజ్ఞ చేస్తున్నారు.అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ఆరంభానికి, నిర్వ‌హ‌ణ‌కు తొలి ప్రాధాన్యం ఇస్తూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి మైలేజీ  పెంచుకోవాల‌ని యోచిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యాన చిన‌బాబును ఢీ కొనేందుకు వైసీపీ మ‌రో ఇద్ద‌రిని రంగంలోకి దించ‌నుంది మ‌ళ్లీ ! ఇప్ప‌టికే సంబంధిత వ‌ర్గాల‌కు చెందిన వాళ్లంతా ఫీల్డ్-లో మోహ‌రించి ఉన్నారు. అయినా కూడా తాను బెదిరిపోన‌ని చిన‌బాబు అంటున్నారు.

ఇదే సంద‌ర్భంలో చిన‌బాబు లోకేశ్-కు త‌గిన సంద‌ర్భంలో త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని వైసీపీ నేత‌లు వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్, కొడాలి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని అంటున్నారు. వాళ్లేం అన్నా వినిపించుకోని స్థితిలో ఉన్నారు లోకేశ్. తాజాగా మంగ‌ళ‌గిరిలో లోకేశ్ ఏర్పాటు చేసిన  అన్నా క్యాంటీన్-ను కొంద‌రు పోలీసులు కూల‌గొట్టారు. మ‌రోసారి కూడా  క్యాంటీన్ ఏర్పాటు చేసినా అది కూడా తొల‌గింపున‌కే గురి అయింది. ఆ విధంగా లోకేశ్ త‌న ప‌ట్టును పెంచుకునేందుకు,  ప్ర‌జ‌ల్లో మ‌మేకం అయ్యేందుకు క్యాంటీన్ రాజ‌కీయం షురూ చేశార‌న్న విమర్శలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి.

లోకేశ్ ఉద్దేశం ఎలా ఉన్నా ఇవాళ మ‌రోసారి అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది. మంగ‌ళ‌గిరి కేంద్రంగా రూపుదిద్దుకున్న ఈ క్యాంటీన్ నిర్వ‌హ‌ణ‌ను అడ్డుకునేందుకు, అధికార పార్టీని నిలువ‌రించేందుకు వైసీపీ నానా పాట్లూ పడుతోంది. పోలీసు  చ‌ర్య‌ల‌ను కాద‌ని ఇక్క‌డ మ‌రోసారి ఇంకా చెప్పాలంటే ముచ్చ‌ట‌గా మూడోసారి మంగ‌ళవారం అన్నా క్యాంటీన్ ఓపెన్ అయి పేద‌ల‌కు  ప‌ట్టెడ‌న్నం అందించింది.

క‌ళ్లెదుటే  అన్నా క్యాంటీన్ల కూల్చివేత జ‌రుగుతున్నా ఏం చేయ‌లేని  నిస్స‌హాయ స్థితిలో కొంద‌రు ఉండిపోయారు. ఇవ‌న్నీ రేప‌టి వేళ తీవ్ర ప్ర‌భావం చూప‌నున్నాయి. ఇదే స‌మ‌యంలో అన్నా క్యాంటీన్ల‌ను అడ్డం పెట్టుకుని పొలిటిక‌ల్ ఇమేజ్-ను లేదా మైలేజీని పెంచుకునే క్ర‌మంలో లోకేశ్ ఉన్నా, అందుకు త‌గ్గ కార్యాచ‌ర‌ణ ఉంటే కూడా ఎంతో మేలు.
మంగ‌ళ‌గిరితో పాటు కుప్పంలోనూ అన్నా క్యాంటీన్ల‌ను ఏర్పాటుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అయితే ఇప్ప‌టికే ఏర్పాట‌యిన ఓ క్యాంటీన్ ను అడ్డుకుని., నిబంధ‌న‌లు అతిక్ర‌మించి పేద‌ల‌కు అన్నం పెడితే కేసులు పెడ‌తామ‌ని స్థానిక పోలీసులు హెచ్చరిస్తూ, సంబంధిత ప్ర‌క్రియను మొద‌లు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో ఇక్క‌డ కూడా పోలీసుల మేలేజీ బాగా త‌గ్గి, పొలిటిక‌ల్ మైలేజీ పెరిగి ఉన్నందున ఇదే రేప‌టి వేళ లోకేశ్ బాబు బాగా క‌లిసి వ‌చ్చే విష‌యం అని పలువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news