కవిత బీజేపీలోకి..ఓ డ్రామా..ట్రాప్ ఎందుకు చేయలేదు?

-

రాజకీయ ఎత్తుగడలు వేసి ప్రత్యర్ధులకు చెక్ పెట్టడంలో కేసీఆర్ ధిట్ట అని చెప్పొచ్చు..అవి విలువలతో కూడిన వ్యూహాలు కావచ్చు.ఏ మాత్రం విలువలని లేని వ్యూహాలు కావచ్చు..అవసరానికి తగ్గట్టుగా కేసీఆర్ ముందుకెళ్తారు. ఇక తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీని కట్టడి చేయాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా వీలు కుదరడం లేదు. పైగా కేంద్రంలో అధికారంలో ఉంది..దీంతో రివర్స్‌లో కేసీఆర్‌కు చిక్కులు వస్తున్నాయి. పైగా ఐటీ, ఈడీ రైడ్లతో టీఆర్ఎస్‌లో భారీ కుదుపులు చోటు చేసుకున్నాయి.

దీంతో కేసీఆర్..ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీజేపీకి చెక్ పెట్టాలని చూశారు. నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీలో చేర్చుకోవాలని చూశారని చెప్పి పక్కాగా ట్రాప్ చేసి..ముగ్గురుని అరెస్ట్ చేయించారు..ఇంకా దీనిపై విచారణ నడుస్తోంది. అయితే ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే నడిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీలు మారడం అనేది మామూలు అయింది..పైగా కేసీఆర్..టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఎంతమంది ఎమ్మెల్యేలని లాక్కున్నారో తెలియనిది కాదు.

అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉంది గాని..అది రాజకీయంగా బీజేపీపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. గతంలో ఇలాంటి ట్రాప్ వేసి ఓటుకు నోటు కేసు తెచ్చి తెలంగాణలో టీడీపీని లేకుండా చేశారు. కానీ ఇలాంటి ట్రాప్‌లు బీజేపీ ముందు వర్కౌట్ కాలేదు. సరే బీజేపీపై పోరాటం చేస్తున్న కేసీఆర్..ఇటీవల తన కుమార్తె కవితని సైతం బీజేపీ లాగడానికి చూసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇదంతా డ్రామా అని ఓడిన కవితని ఎవరు చేర్చుకుంటారని, ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ఖర్గేతో మాట్లాడారని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. దీనిపై బీజేపీ ఎంపీ అరవింద్ సైతం ఘాటుగా మాట్లాడారు. దీనికి కవిత కౌంటర్ ఇస్తూ..చెప్పుతో కొడతా, చంపుతాం, తంతాం అంటూ మాట్లాడారు. అలాగే అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. వీటికి కూడా బీజేపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వచ్చాయి.

కాకపోతే కవిత సైతం..తనని బీజేపీలోకి తీసుకెళ్లడానికి ట్రై చేశారని మాట్లాడారు. మరి కేసీఆర్, కవిత చెప్పిన మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందంటే? అసలు ఏ మాత్రం వాస్తవం లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే నలుగురు ఎమ్మెల్యేలని లాగడానికి చూశారని ట్రాప్ చేసి, ఆడియో, వీడియోలు రికార్డ్ చేసినప్పుడు..కవితని బీజేపీలోకి రమ్మన్న నేత ఎవరు..ఆ నేత వివరాలు ఎందుకు చెప్పడం లేదు, ఆడియో, వీడియో రికార్డులు ఎందుకు లేవనే ప్రశ్నలు వస్తున్నాయి. స్వయంగా సీఎం కుమార్తెని బీజేపీ లాగడానికి చూస్తే టీఆర్ఎస్ ఎందుకు ట్రాప్ చేయకుండా ఉందనేది అందరికీ అర్ధమవుతుంది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది. కేవలం బీజేపీని ఇరికించాడనికే ఈ ఎత్తుగడలు అని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news