ఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే జరుగుతాయనే సంగతి తెలిసిందే…కుల సమీకరణాలని దృష్టిలో పెట్టుకునే పార్టీలు రాజకీయం చేస్తుంటాయి. ఎప్పుడు ఎలాంటి వ్యూహంతో…ఏ కులాన్ని ఎప్పుడు ఎలా ఆకట్టుకోవాలో పార్టీలకు బాగా తెలుసు. అలాగే ఎన్నికల్లో కులాల బట్టే అభ్యర్ధులని డిసైడ్ చేస్తూ ఉంటారు. అయితే కృష్ణా జిల్లాలో ఎక్కువ సీట్లు కమ్మ నేతలకే దక్కుతూ ఉంటాయి. ఓట్లు పరంగా తక్కువ ఉన్నా సరే..రాజకీయంగా కమ్మ వర్గానికి బలం ఎక్కువ.
అటు టీడీపీ అయిన, వైసీపీ అయిన కొన్ని సీట్లు కమ్మ వర్గానికే కేటాయిస్తూ ఉంటుంది…గత ఎన్నికల్లో పలు చోట్ల రెండు వైపులా కమ్మ అభ్యర్ధులే నిలబడ్డారు. అయితే అప్పుడు వైసీపీ పైచేయి సాధించింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కమ్మ నేతల మధ్య వార్ నడిచేలా ఉంది…మరి ఈ సారి ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రెండు పార్టీల్లో కమ్మ నేతలు బరిలో దిగే నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి…టీడీపీ నుంచి దేవినేని ఉమా, వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ పోటీ చేశారు. గత ఎన్నికల్లో వసంత గెలిచారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఉమా వైపు మొగ్గు ఎక్కువ ఉంది. ఇక విజయవాడ తూర్పులో ఈ సారి కమ్మ నేతల మధ్య టఫ్ ఫైట్ నడవనుంది. టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ బరిలో దిగనున్నారు. వీరి మధ్య పోరు హోరాహోరీగా జరిగేలా ఉంది.
అటు గుడివాడలో వైసీపీ నుంచి కొడాలి నాని, టీడీపీ నుంచి రావి వెంకటేశ్వరరావు పోటీ చేయొచ్చు…ఇక్కడ కొడాలి నానికే గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక గన్నవరంలో వైసీపీ తరుపున వల్లభనేని వంశీ పోటీ చేయడం ఖాయం. టీడీపీ ఇంచార్జ్ గా బీసీ నేత బచ్చుల అర్జునుడు ఉన్నారు..కానీ నెక్స్ట్ ఈ సీటు కమ్మ నేతకే దక్కవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే గన్నవరంలో కమ్మ నేతల మధ్య పోరు నడుస్తుంది. మొత్తానికి కృష్ణాలో కమ్మ నేతల మధ్య ఫైట్ జరగనుంది.