కవిత-కడియంలకు లక్కీ ఛాన్స్ ఉందా?

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా కరెక్ట్‌గా రెండేళ్ల సమయం ఉంది..అయితే కేసీఆర్ ఏమన్నా ముందస్తు ఎన్నికలకు వెళితే…మరో ఏడాదిన్నరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సరే ఎప్పుడైనా గానీ… ఇప్పటినుంచే తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రత్యర్ధులని చిత్తు చేయాలని చెప్పి..పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

ఇదే క్రమంలో అధికార టీఆర్ఎస్ సైతం…మళ్ళీ ప్రత్యర్ధులకు చెక్ పెట్టి మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ దిశగా కేసీఆర్ తన వ్యూహాలని అమలు చేయడం మొదలుపెట్టేశారు. ప్రత్యర్ధులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో సొంత పార్టీలో కూడా ఉన్న లోపాలని సరి చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ గెలవాలంటే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకూడదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది. అలా వ్యతిరేకత వచ్చిన వారిని పక్కన పెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

అలాగే పలువురు మంత్రులని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉన్న క్యాబినెట్‌లో 10 మంది మంత్రులు దాకా…సరైన పనితీరు కనబర్చడం లేదని తెలుస్తోంది. ఏదో సొంత ప్రయోజనాలు తప్ప…ప్రజా ప్రయోజనాలని వారు పట్టించుకోవడం లేదని టాక్. ఇక అలాంటి వారిని సైడ్ చేసి..కొత్తవారికి క్యాబినెట్‌లో అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని సమాచారం.

ఇదే క్రమంలో ఇటీవల ఎమ్మెల్సీలైన వారికి కూడా ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా కవితని క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అలాగే కడియం శ్రీహరిని సైతం మంత్రివర్గంలో చోటు ఇస్తారని తెలుస్తోంది. అటు గుత్తా సుఖేందర్‌కు మండలి ఛైర్మన్, బండా ప్రకాష్‌కు డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఇవ్వొచ్చని తెలుస్తోంది. త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నెక్స్ట్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా..నెక్స్ట్ మంత్రివర్గం కూర్పు కూడా ఉంటుందని తెలుస్తోంది.