జగన్‌కు నెగిటివ్‌గా కేసీఆర్..బాబు మాటనే పలికారే..!

-

ఈ మధ్య ఏపీతో తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చి చూపించడం ఎక్కువైంది. ఏపీ కంటే  తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని..గతంలో తెలంగాణ వస్తే ఎడారిగా మారిపోతుందని అన్నారని, కానీ ఇప్పుడు సీన్ మారిందని..తెలంగాణ అభివృద్ధి చెందితే..ఏపీ ఎడారిగా మారే పరిస్తితి వచ్చిందని తెలంగాణ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల ఆర్ధిక పరిస్తితులు పోలుస్తున్నారు.  ఇక ఏపీ కంటే తెలంగాణ పరిస్తితి వెయ్యి రేట్లు బెటర్ గా ఉందని, ఇంకా ఇక్కడ 24 గంటల కరెంట్ ఉంటే..ఏపీలో కరెంట్ కోతలు ఉన్నాయని సి‌ఎం కే‌సి‌ఆర్ పదే పదే కామెంట్ చేస్తున్నారు.

ఇక ఏపీ, తెలంగాణ రోడ్ల గురించి కూడా పోలిక పెడుతున్నారు. ఏపీలో రోడ్లు దారుణంగా ఉన్నాయని మంత్రులు కే‌టి‌ఆర్, హరీష్ రావు కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఏపీలోని కోనసీమని మించేలా ఇప్పుడు తెలంగాణలో పంటలు పండుతున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీ ఆర్ధిక పరిస్తితి దారుణంగా ఉందని…ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 5 ఎకరాలు కొనే పరిస్తితి ఉండేది అని, ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాల వరకు కొనే పరిస్తితి ఉందని అంటున్నారు.

ఇటీవల ఈ మాటలు టి‌డి‌పి అధినేత చంద్రబాబు చెప్పగా, తాజాగా పటాన్‌చెరు సభలో కే‌సి‌ఆర్ చెప్పారు. చంద్రబాబు ఇలా అన్నారని చెబుతూ..తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 నుంచి వంద ఎకరాలు కొనే పరిస్తితి ఉందని చెప్పుకొచ్చారు. అయితే కే‌సి‌ఆర్, జగన్‌ల మధ్య సఖ్యత ఉంది. కానీ ఇలా చెప్పడం వల పరోక్షంగా జగన్‌కే నష్టం జరుగుతుంది.

పదే పదే పోల్చడం వల్ల జగన్‌కు ఇబ్బందిగా మారింది. పైగా ఇప్పుడు చంద్రబాబు మాటలనే కే‌సి‌ఆర్ చెప్పారు..దీంతో టి‌డి‌పి అనుకూల మీడియా, టి‌డి‌పి శ్రేణులు ఆ మాటలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ అంశాలు జగన్‌కు నెగిటివ్ అవుతున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికలు ఉండటంతో కే‌సి‌ఆర్ తమ పాలన బాగుందని చెప్పడానికి..ఏపీతో పోలుస్తున్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news