ముందస్తు పోరు: రేవంత్ సరే.. ‘షా’కు ఎలా తెలిసింది?

తెలంగాణలో ఈ మధ్య కేసీఆర్ వేసే స్కెచ్‌లు పెద్దగా వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఆయనకు ధీటుగా ప్రత్యర్ధులు సైతం అదిరిపోయే వ్యూహాలతో ముందుకొస్తున్నారు. అందుకే కేసీఆర్ వ్యూహాలు అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కావడం లేదు. గతంలో అయితే ప్రత్యర్ధులకు చిక్కకుండా కేసీఆర్ వ్యూహాలు ఉండేవి..ఏ మాత్రం ప్రత్యర్ధుల ఊహాకు కూడా అందేవి కాదు. అలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్ళి 2018 ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టేశారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే ఇప్పుడు కూడా కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధంగా చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. మరొకసారి ముందస్తుకు వెళ్ళి మూడో సారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. కానీ గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రతిపక్షాలు లేవు…కేసీఆర్‌కు ధీటుగా వారు కూడా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ అధిష్టానం నుంచి మాత్రం..ముందస్తుకు వెళ్ళే అవకాశాలు లేవని వస్తుంది. కేటీఆర్ సైతం ముందస్తుకు వెళ్ళడం లేదని మాట్లాడారు.

కానీ అలా ప్రతిపక్షాలని మాయ చేసి కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ముందస్తుపై సమాచారం ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి చెబుతుంటే కొందరికి డౌట్ ఉండొచ్చు…కానీ ఇప్పుడు ఏకంగా హోమ్ మంత్రి అమిత్ షా…కేసీఆర్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని, బీజేపీ నేతలతో చెప్పడం చర్చనీయాంశమైంది.

ముందస్తుకు వెళ్ళే విషయంలో అమిత్ షాకు పక్కా సమాచారం ఉందని తెలుస్తోంది. ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా షాకు సమాచారం వచ్చిందని తెలుస్తోంది. కేసీఆర్ ఇప్పటికే పథకాల అమలుని పూర్తి చేయాలని చూస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళితబంధు అమలు చేయాలని చూస్తున్నారని తెలిసింది. అయితే వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత కేసీఆర్ ముందస్తుకు వెళ్లబోతున్నారని కొద్ది రోజులుగా తెలంగాణలో ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్లుగానే ఆయన ఆ సమయానికల్లా పథకాలన్నీ పూర్తి చేయాలని షెడ్యూల్ రూపొందించుకున్నారని తెలుస్తోంది. అందుకే షా సైతం కేసీఆర్ ముందస్తు ప్రణాళికని ముందుగానే పసిగట్టారు.