ఖమ్మం మాజీ తమ్ముళ్ళకు మళ్ళీ ఛాన్స్ ఉందా?

-

ఒకప్పుడు తెలంగాణలో టీడీపీకి ఎంత బలం ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తెలంగాణలోని బీసీ వర్గం టీడీపీకి అండగా నిలబడేది. ఆ జిల్లా..ఈ జిల్లా అనే తేడా లేకుండా అన్నీ జిల్లాల్లో టీడీపీ సత్తా చాటేది. అయితే ఇదంతా తెలంగాణ ఏర్పడక ముందు. రాష్ట్రం ఏర్పాడ్డాక టీడీపీ పరిస్తితి దిగజారుతూ వచ్చింది. రాష్ట్రం ఏర్పాడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ 15 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు టీడీపీ దిగజారిపోయింది. ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోకి వచ్చారు. దీంతో తెలంగాణలో టీడీపీ కథ ముగింపు దశకు వచ్చేసింది.

అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని టీడీపీ రెండు సీట్లు గెలుచుకుని..కాస్త తెలంగాణలో ప్రాతినిధ్యం ఉండేలా చేసుకుంది. కానీ కేసీఆర్..వెంటనే ఒక ఎమ్మెల్యేని లాగేసుకున్నారు. వరుసగా సత్తుపల్లి నుంచి మూడుసార్లు టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీరయ్యని టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారు. కానీ అశ్వరావుపేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు టీడీపీలోనే చాలా కాలం కొనసాగారు.

కానీ పార్టీ పరిస్తితి మెరుగుపడకపోవడంతో మెచ్చా కూడా టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళ్ళడంతో టీడీపీ కథ ముగిసింది. ఇప్పుడు ఆ ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వారు టీఆర్ఎస్ నుంచి నిలబడనున్నారు. ఈ ఇద్దరికీ దాదాపు సీట్లు ఫిక్స్ అని చెప్పొచ్చు. మరి గెలుపు ఈజీగా వస్తుందా? అంటే చెప్పలేని పరిస్తితి. ఎందుకంటే ఇటు సత్తుపల్లిలో గాని, అటు అశ్వరావుపేటలో గాని టీఆర్ఎస్‌కు బలం తక్కువ. అలాగే కాంగ్రెస్‌కు బలం ఉంది..ఇంకా టీడీపీని అభిమానించే వారు ఉన్నారు.

టీడీపీని అభిమానించే వారు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే పర్లేదు..అలా కాకుండా వారు కాంగ్రెస్ వైపు గాని చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలకు రిస్క్ తప్పదు. పైగా ఖమ్మంలో బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఇద్దరు ఎమ్మెల్యేలకు గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news