హస్తంలో కోమటిరెడ్డి ట్విస్ట్..కమలానికి లక్కీ ఛాన్స్?

-

కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే…కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్..ఇందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి..మొదట నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్  కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయతతో పనిచేస్తూ వస్తున్నారు. పార్టీ సంక్షోభ సమయంలో కూడా పార్టీ కోసం నిలబడ్డారు. కాంగ్రెస్ ఇప్పుడు కూడా కష్టాల్లోనే ఉంది…ఇప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలో నిలబడ్డారు. కాకపోతే ఆ మధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం చిన్న ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని మాట్లాడారు..అప్పటినుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు.

ఇటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం పి‌సి‌సి పదవి దక్కని దగ్గర నుంచి కాస్త అసంతృప్తిగానే ఉంటున్నారు. కాకపోతే సోనియా గాంధీ, రాహుల గాంధీపై ఉన్న అభిమానంతో ఆయన పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది. ఇద్దరు బీజేపీలోకి వెళ్లొచ్చని కథనాలు వచ్చాయి. కానీ వాటిని కొట్టిపారేస్తూ..వెంకటరెడ్డి కాంగ్రెస్ లో పనిచేస్తూనే ఉన్నారు.

కాకపోతే రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీలో ఎక్కువ కనిపించడం లేదు…ఆయన సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ వ్యూహం ఎంటనేది ఎవరికి అర్ధం కావడం లేదు. వెంకటరెడ్డి పరిస్తితి ఎలా ఉన్న…రాజగోపాల్ మాత్రం బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం ఎక్కువ నడుస్తోంది. బీజేపీ సైతం రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోచ్చేందుకు చూస్తుంది. రాజగోపాల్ లాంటి నేత వస్తే నల్గొండలో బీజేపీకి కాస్త బలం పెరుగుతుంది.

అయితే రాజగోపాల్ పార్టీ మార్పు అనేది ఇప్పుడే జరిగేలా లేదు. ఎన్నికల ముందు రాజకీయ పరిస్తితులని బట్టి ఆయన ముందుకెళ్లెలా ఉన్నారు…ఇక వెంకటరెడ్డి కూడా అలాగే చేస్తారా..లేక కాంగ్రెస్ తరుపున నిలబడతారా? అనేది చూడాలి. ఇప్పుడున్న పరిస్తితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారని తెలుస్తోంది. చూడాలి మరి కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇచ్చే ట్విస్ట్ లు ఎలా ఉంటాయో?

Read more RELATED
Recommended to you

Latest news