జాదూ క్యాలెండర్‌తో యువతకి తీరని ద్రోహం

-

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ (Calendar‌)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. గురువారం నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించిన లోకేష్ వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం జగన్ మోహన్ రెడ్డి జాదూ క్యాలెండర్‌తో యువతకి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఫ్యాన్ తిప్పుతూ అధికారం రాగానే 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని, 2 లక్షల 30 వేల ఉద్యోగాలకు ఒకే సారి నోటిఫికేషన్ అన్నారని .., కానీ ఇప్పుడు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అదే ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన తరువాత 10 వేల ఉద్యోగాలతో జాదూ క్యాలెండర్ విడుదల చేసి యువతకి తీరని ద్రోహం చేసారని లోకేష్ మండిపడ్డారు. 2.30 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు స్థోమతకు మించి అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్నారని…ఇప్పుడు వారంతా తిరిగి ఊరు వెళ్లలేక, అమ్మానాన్నలకు మొఖం చూపించలేక ఆందోళనలో ఉన్నారని ఆవేదన చెందారు. నిరుద్యోగులు పడుతున్న ఆందోళన చూస్తే బాధేస్తుందని పేర్కొన్నారు. ఆత్మ‌హ‌త్య‌లు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాదని నిరుద్యోగులు నిరుత్సాహ పడొద్దని లోకేష్ సూచించారు. ప్రభుత్వంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news