చినబాబు టీం రెడీ..సీనియర్లకు షాక్?

-

తెలుగుదేశం పార్టీని భవిష్యత్ లో నడిపించే అధినాయకుడు ఎవరంటే…నారా లోకేష్ అని సమాధానం టీడీపీ శ్రేణుల నుంచి ఎక్కువ వస్తుంది…చంద్రబాబు తర్వాత చినబాబు చేతుల్లోకి టీడీపీ పగ్గాలు వస్తాయని క్లారిటీగా తెలుస్తోంది. కాకపోతే టీడీపీలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ని చంద్రబాబు పట్టించుకునే ఛాన్స్ ఉండదు..తన వారసుడుకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారు.

అయితే భవిష్యత్ లో పార్టీ పగ్గాలు దక్కనున్న నేపథ్యంలో నారా లోకేష్ ఎప్పటినుంచో పార్టీపై గ్రిప్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. అలాగే తనకంటూ సెపరేట్ టీంని సైతం రెడీ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో పార్టీపై గ్రిప్ మరింత పెంచుకోవడానికి ఇప్పటినుంచే పార్టీలో తన టీంని రెడీ చేసుకున్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో తన టీంకు టికెట్లు కూడా కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు…వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే అని ప్రకటించిన విషయం తెలిసిందే. లోకేష్ డైరక్షన్ లోనే ఈ ప్రకటన వచ్చిందని తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి సీట్లు ఇవ్వడం కష్టమే అని లోకేష్ తేల్చి చెప్పేశారు. దీంతో కొందరు సీనియర్లు టికెట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ స్థానాల్లో యువ నేతలని బరిలో దింపడానికి బాబు చూస్తున్నారు.

ఇప్పటికే పలు చోట్ల యువ నేతలకు సీట్లు ఫిక్స్ చేసేశారు..అయితే కొన్ని చోట్ల సీనియర్ నేతల వారసులకు సీట్లు కేటాయించారు. ఇక ఎన్నికల ముందు మరి కొందరికి సీట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 70 సీట్లలో యువ నేతలని పెట్టాలనేది చినబాబు ఆలోచన అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ ఎక్కువగా యువతకు సీట్లు ఇచ్చి సక్సెస్ అయ్యారు..అదే బాటలో చినబాబు వెళుతున్నారు…కానీ జగన్ మాదిరిగా సక్సెస్ అవుతారో…లేక అట్టర్ ఫ్లాప్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news