మునుగోడు టైమ్..పోస్టర్ల వార్..!

-

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతుంది..ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీలు ఓటర్లని ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఓటర్లని ఆకర్షించడానికి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్కే లేకుండా పోయింది. ఎన్నిక అయ్యేవరకు మునుగోడు ప్రజలకు ప్రతిరోజూ పండుగే అన్నట్లు పరిస్తితి ఉంది. విందు, మందు అన్నట్లుగా రాజకీయ నేతలు..ప్రజలని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇక ఇతర పార్టీల నేతల కొనుగోలు, పార్టీ జంపింగులు ..ఇలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్..తమ అధికార బలాన్ని మొత్తం ఉపయోగిస్తుంది. పార్టీ మొత్తం మునుగోడులోనే ఉంది. ప్రతి ఓటరుని కలవడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే కులాల పరంగా కుల పెద్దలతో మీటింగులు పెట్టడం, కులాల ఓట్లు పడేలా చేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది.

అటు బీజేపీ తరుపున అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..టీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు. తన రాజీనామా వల్లే ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మునుగోడులో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఒక్క ఓటు కూడా ముఖ్యమనే విధంగా బీజేపీ ముందుకెళుతుంది. అయితే ఇటీవల రాజగోపాల్..కాంట్రాక్టులకు సంబంధించిన పోస్టర్లు, తాము మోసపోయాం..మీరు మోసపోవద్దని దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు పేరుతో మునుగోడులో పోస్టర్ల కలకలం రేగుతుంది. ఇవన్నీ టీఆర్ఎస్ చేస్తున్న ఫేక్ పోస్టర్లు అని బీజేపీ ఫైర్ అవుతుంది.

 

ఇక టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ సైతం..కోమటిరెడ్డి రాజీనామా వల్ల..మునుగోడులో ఏ కార్యక్రమాలు జరిగాయో..వాటిని పోస్టర్లలో వేస్తున్నారు. ఇలా పోస్టర్ల వార్ నడుస్తోంది.  ఫలిస్తున్న రాజన్న రాజీనామా పేరుతో ఆ పోస్టర్లు వచ్చాయి. ఇలా రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. అటు సెంటిమెంట్ అస్త్రంతో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ముందుకెళుతున్నారు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ..ఎక్కడకక్కడ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆడబిడ్డని అని చెప్పి సెంటిమెంట్ అస్త్రం వదులుతున్నారు. మొత్తానికి మునుగోడులో మూడు పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news