నేషనల్ సర్వే: కేసీఆర్ స్థాయి దిగజారిందా?

ఇంతకాలం తెలంగాణలో తిరుగులేని బలంతో ఉన్న సీఎం కేసీఆర్‌ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ అంటే కేసీఆర్…కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లు రాజకీయం నడిచింది. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది…ప్రతిపక్షాల బలం పెరిగింది. దీంతో కేసీఆర్ బలం తగ్గుతూ వస్తుంది. ఇంకా కేసీఆర్ రాజకీయాన్ని జనం నమ్మేలా లేరు.

kcr
kcr

అయినా సరే జనాలని ఆకర్షించడానికి కేసీఆర్ ఎప్పుడు ఏదొక ఎత్తు వేస్తూనే ఉన్నారు. అలాగే ఈ మధ్య థర్డ్ ఫ్రంట్ అంటూ నేషనల్ పాలిటిక్స్‌లో హడావిడి చేస్తున్నారు. అయితే ఇవేమీ వర్కౌట్ అయ్యేలా లేవు. అసలు జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ పరిస్తితి దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన కలిసిన జాతీయ నేతలంతా హ్యాండ్ ఇచ్చేశారు. ఇక తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట నిర్వహించిన మోస్ట్ పాపులర్ సీఎం కేటగిరీ సర్వేలో కూడా కేసీఆర్ పేరు టాప్‌లో లేదు.

దేశం మొత్తంలో మోస్ట్ పాపులర్ సీఎం ఎవరంటూ నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. తర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింజ్ కేజ్రీవాల్, ఆ తర్వాత స్థానాల్లో మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ ధాకరే, జగన్‌లు ఉన్నారు. ఈ కేటగిరీలో కేసీఆర్ కనిపించలేదు. ఇక సొంత రాష్ట్రాల్లో జరిగిన సర్వేల్లో కూడా కేసీఆర్ అడ్రెస్ లేరు. ఇది మోస్ట్ పాపులస్ కేటగిరీ…ఇందులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉండగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండోస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్టాలిన్, ఉద్దవ్ ధాకరే, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, హిమంత భిశ్వ శర్మ, భూపేష్ బాఘెల్, అశోక్ గెహ్లాట్‌లు ఉన్నారు.

ఈ కేటగిరీలో జగన్ గాని, కేసీఆర్ గాని చోటు దక్కించుకోలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ అటు తెలంగాణ కాకుండా దేశంలో నిర్వహించిన పోల్‌ విషయంలోనూ వెనుకబడి ఉన్నారు. జాతీయ రాజకీయాల హడావిడి చేస్తున్న కేసీఆర్.. కనీసం సీఎంగా జాతీయస్థాయిలో గుర్తింపు కూడా తెచ్చుకోలేదు…అలాగే రాష్ట్ర స్థాయిలోనూ వెనుకబడ్డారు.