‘ఎన్టీఆర్’ వైసీపీకి కలిసిరావడం లేదా?

-

ఎన్టీఆర్..ఈ మూడు అక్షరాల పేరుకు చాలా పవర్ ఉంది…అలాగే తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి సత్తా చాటిన విషయం అందరికీ తెలిసిందే..ఆ తర్వాత టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లింది. ఇక అక్కడ నుంచి ఎన్టీఆర్ తెలుగుదేశం సొత్తుగా టీడీపీ నేతలు రాజకీయం చేస్తారు. అయితే ఎన్టీఆర్ పేరుని ఇతర పార్టీల వారు కూడా ఒకోసారి వాడుకుంటారు.

ఇక వైసీపీలో కూడా ఎన్టీఆర్ ని అభిమానించే వారు ఉన్నారు…అందులో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు..ఆయనే ఇటీవల ఎన్టీఆర్ తెలుగు ప్రజల సొత్తు అని, ఆయన పేరు వాడుకునే హక్కు అందరికీ ఉందని మాట్లాడారు. అలాగే ఎన్టీఆర్ పేరుతో జగన్ ప్రభుత్వం జిల్లా కూడా ఏర్పాటు చేసింది. ఈ మధ్యే 13 జిల్లాలని కాస్త 26 జిల్లాలుగా విభజించారు. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాని రెండుగా విభజించారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిని కృష్ణా జిల్లాగా ఉంచేసి…విజయవాడ పార్లమెంట్ పరిధికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. అయితే ఇలా పెట్టడం వల్ల జిల్లాలో రాజకీయంగా తమకు కలిసొస్తుందనేది వైసీపీ ప్లాన్. ఎన్టీఆర్ అభిమానులు, కొంత కమ్మ సామాజికవర్గం వైసీపీకి మద్ధతుగా ఉంటారని భావించారు.

కానీ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన పెద్దగా కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. జిల్లాలో ఉన్న 7 స్థానాల్లో వైసీపీకి అనుకూల వాతావరణం లేనట్లే ఉంది. అయితే ఆరు స్థానాలు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. విజయవాడ సెంట్రల్, వెస్ట్, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట స్థానాలు వైసీపీకే ఉన్నాయి. ఒక్క విజయవాడ తూర్పు మాత్రం టీడీపీ చేతుల్లో ఉంది.

అయితే వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది…పైగా రాజధాని అమరావతి అంశం బాగా మైనస్ అవుతుంది. ముఖ్యంగా మైలవరం, విజయవాడ సెంట్రల్, వెస్ట్, జగ్గయ్యపేట సీట్లలో వైసీపీకి అనుకూల వాతావరణం కనిపించడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీనే పైచేయి సాధించేలా ఉంది. మొత్తానికైతే ఎన్టీఆర్ జిల్లా వైసీపీకి కలిసొచ్చేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news