నెక్స్ట్ ఏపీలో జరిగే ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని అర్ధమైపోతుంది…ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాన్ని బట్టి చూస్తే ఈ సారి వైసీపీకి గెలుపు అనేది అంత ఈజీ కాదు…గత ఎన్నికల మాదిరిగా వన్ సైడ్ గా గెలవడం చాలా కష్టం. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ గత ఎన్నికలంటే ఇప్పుడు పుంజుకుంది…అలా అని టీడీపీకి అధికారం దక్కించుకునే బలం ఇంకా రాలేదు. అంటే మొత్తం మీద వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగేలా ఉంది. ఇక జనసేన సైతం కొన్ని స్థానాల్లో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.
అదే సమయంలో టీడీపీ గాని జనసేనతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది..అందుకే అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ గాని పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు..అయితే ఇదంతా మొన్నటివరకే ఇప్పుడు పొత్తు విషయంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్నారు. పవన్ కల్యాణ్ డిమాండ్లు భారీగా ఉండటంతో చంద్రబాబు మళ్ళీ పొత్తు గురించి మాట్లాడటం లేదు. తమకు ప్రజల్లో మద్ధతు పెరిగిందని, సింగిల్ గానే పోటీ చేసి సత్తా చాటుతామని చంద్రబాబు భావిస్తున్నారు.
అదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తు సెట్ చేయాలని కొందరు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ పవన్ డిమాండ్లు విన్న బాబు..తాము సింగిల్ గానే ఎన్నికలకు పోతామని ఆ కీలక నేతలకు చెబుతున్నారట. అటు పవన్ సైతం…పొత్తు గురించి ఇంకా మాట్లాడవద్దని ఆ నేతలకు తేల్చి చెప్పారట.
ఎన్నికలు అయ్యాక అప్పుడు పొత్తు గురించి మాట్లాడకుందామని అంటున్నారట..అంటే అప్పుడు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకుండా..ప్రభుత్వ ఏర్పాటుకు జనసేన సీట్లు కీలకమవుతాయని పవన్ భావిస్తున్నారట. అంటే తాను కింగ్ మేకర్ అవుతానని పవన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడు సీఎం సీటు తప్పనిసరిగా వస్తుందని పవన్ అనుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికైతే పొత్తు విషయంలో ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు..మరి పవన్ కింగ్ మేకర్ అవుతారో లేదో చూడాలి.