పవన్ హవా..జనసేన వైపు వైసీపీ-టీడీపీ నేతలు..!

ఏపీలో పవన్ కల్యాణ్ బలం పెరుగుతుంది..గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పవన్ హవా పెరిగినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ వల్ల జనసేనకు ఎక్కువ ఓట్లు కూడా రాలేదు. ఆఖరికి పవన్ సైతం ఓడిపోయారు. ఆ పార్టీకి కేవలం 6 శాతం ఓట్లు, ఒక సీటు వచ్చింది. గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇలా జనసేనకు ఫలితాలు నిరాశజనకంగా వచ్చాయి.

అయినా సరే  పవన్ నిరాశపడకుండా..మళ్ళీ పోరాటం చేసి పార్టీని గాడిలో పెట్టారు. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ, ప్రజలకు భరోసా కలిగించారు. దీంతో ప్రజల్లో పవన్‌పై నమ్మకం పెరిగింది. దీంతో వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకతని టీడీపీతో పాటు పవన్ కూడా యూజ్ చేసుకున్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు పూర్తిగా టీడీపీకి వెళ్లకుండా జనసేన వైపు కూడా కాస్త టర్న్ అయ్యాయి. దీంతో జనసేన ఓటు బ్యాంక్ పెరిగింది.

6 శాతం కాస్త 12 శాతం వరకు వెళ్లిందని సర్వేలు చెబుతున్నాయి..దీంతో జనసేన వైపు చూసే నేతల లిస్ట్ కూడా పెరిగినట్లు సమాచారం. జనసేన బలపడిన స్థానాల్లో పోటీ పెరిగిందని చెప్పొచ్చు. అదే సమయంలో టీడీపీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లు జనసేన ఈజీగా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఆ సీట్లపై ఇప్పటినుంచే కర్చీఫ్ వేసేందుకు నేతలు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే క్రమంలో పిఠాపురంలో జనసేనకు బలం కనిపిస్తోంది. దీంతో ఈ సీటు కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు కూడా ట్రై చేస్తున్నారట. కొందరు వైసీపీ కీలక నేతలు ఇప్పటికే పవన్‌ని కలిశారు..జనసేనలో చేరారు. పిఠాపురం సీటు కోసమే వారు జనసేనలోకి వచ్చారని తెలుస్తోంది. అటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం జనసేనలోకి రావడానికి ట్రై చేస్తున్నారట. పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు ఇస్తారని టాక్. అందుకే ఇప్పటినుంచే జనసేనలోకి వచ్చి పిఠాపురం సీటు దక్కించుకోవాలని చూస్తున్నారట. మొత్తానికి జనసేనకు కూడా కాస్త ఊపు కనిపిస్తోంది.