పొంగులేటి-జూపల్లి కన్ఫ్యూజ్ పాలిటిక్స్..స్కెచ్ ఉందా?

-

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసే రాజకీయంగా పూర్తిగా కన్ఫ్యూజన్ స్థాయిలో ఉంటుంది..వారు క్లారిటీగా ఉంటూ..రాజకీయాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? లేక వారే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అనేది క్లారిటీ లేదు. మొన్నటివరకు అంటే బి‌ఆర్ఎస్ లో పనిచేశారు. అక్కడ ప్రాధాన్యత లేక బయటకొచ్చారు. ఇదే క్రమంలో బి‌ఆర్‌ఎస్ నుంచి ఇద్దరు నేతలని సస్పెండ్ చేశారు.

దీంతో ఆ ఇద్దరు ఏ పార్టీలో చేరతారనే ఉత్కంఠ నడుస్తుంది. ఇప్పటికే ఆ ఇద్దరితో బి‌జే‌పి, కాంగ్రెస్ నేతలు చర్చలు చేశారు. తమ పార్టీలోకి రావాలంటే తమ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపారు. ఇక అందరితో పొంగులేటి, జూపల్లి సఖ్యతగానే మెలిగారు. కానీ వారు ఏ పార్టీలోకి వెళ్ళేది తేల్చలేదు. పైగా పొంగులేటి ఖమ్మం జిల్లాలో సొంతంగా బలపడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడకక్కడ తన అనుచరులని, కార్యకర్తలని కలుస్తూ..తన బలాన్ని పెంచుకుంటున్నారు. పోనీ ఇలా చేస్తున్నాడు కదా..కొత్తగా పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా? అంటే అది క్లారిటీ లేదు.

ఇలా వారిద్దరు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియడం లేదు. ఇదే క్రమంలో తాజాగా పొంగులేటి..ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యి వచ్చారు. ఆ వెంటనే ఇక్కడ ఈటల రాజేందర్ తో ఫామ్ హౌస్ లో రహస్యంగా భేటీ అయ్యారు. దీంతో బి‌జే‌పిలోకి వెళ్తారా? అంటే అది తేలలేదు. అసలు పొంగులేటి, జూపల్లి స్కెచ్ ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.

వారిద్దరు ఏ పార్టీలోకి వెళ్తారు..ఇప్పటికీ తెలియడం లేదు. వారి టార్గెట్ మాత్రం కే‌సి‌ఆర్‌ని గద్దె దించడం అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి అందుకోసం ఇద్దరు నేతలు బి‌జే‌పిలోకి వెళ్తారా? లేక కాంగ్రెస్ లోకి వెళ్తారా? లేదా కొత్త పార్టీ పెడతారా? అనేది సస్పెన్స్ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version