ముఖ్యంగా ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా ఇదే సమావేశాల్లో వ్యూహ రచన సాగనుంది. అదేవిధంగా వచ్చే ఏడాదిలో జరిగే మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ , మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా వ్యూహ రచన చేయనున్నారు.
ఇక ఏపీలో జరిగే ప్రధాని పర్యటనకు సంబంధించి కూడా ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు 125 జయంత్యుత్సవాలు జరగనున్నాయి. వీటికి అతిథిగా పాల్గొనేందుకు మోడీ వస్తున్నారు. ఇక్కడే 30 అడుగుల మన్యం వీరుడు అల్లూరి కాంస్య విగ్రహం ఆవిష్కరించి, వారికి నివాళులర్పించనున్నారు. పార్టీలకు అతీతంగా అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నది మోడీ పిలుపు. ఇప్పటికే ఈ పిలుపులో భాగంగా ఆంధ్రావని లో ప్రధాన విపక్ష పార్టీలు అయిన టీడీపీ, జనసేనకు ఆహ్వానాలు అందాయి. కాళ్ల మండలం, పెదఅమిరంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మాట్లాడనున్నారు. ఆయన ప్రసంగం అనంతరం ఇక్కడి నేతలు ప్రత్యేకించి భేటీ కానున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ భద్రతా బలగాలు అణువణువూ తనిఖీ చేసి వెళ్లాయి. జిల్లా ఎస్పీ తో సమన్వయం చేసుకుని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ కార్యవర్గం నిరంతరం పనిచేస్తోంది.