రఘురామ వర్సెస్ వైసీపీ…పైచేయి ఎవరిది?

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై వైసీపీ ఎంపీలు ఒత్తిడి పెంచుతున్నారు. పార్టీలో తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయించటమే లక్ష్యంగా పార్టీ ఎంపిలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు స్పీకర్ ను కలిసిన ఎంపిలు తాజాగా కూడా కలిశారు. తిరుగుబాటు ఎంపి అనర్హత వేటు వేయటంలో జరుగుతున్న జాప్యంపై చర్చించారు.

రఘురామ కృష్ణరాజు /Raghu Rama Krishna Raju

రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్ స్పీకర్ తో భేటీ అయ్యారు. తమ విజ్ఞప్తులపై చర్యలు తీసుకోవటంలో జరుగుతున్న ఆలస్యంపై కాస్త అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారట. ఈమధ్య హోంశాఖ మంత్రి అమిత్ షా ను జగన్మోహన్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. వాళ్ళ భేటిలో చర్చకు  వచ్చిన అనేక అంశాల్లో రఘురామపై అనర్హత వేటు కూడా ఒకటి. తాజాగా స్పీకర్ తో జరిగిన భేటీలో ఎంపికి వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలు అందించారు.

జగన్ తో విభేదాలు వచ్చి పార్టీకి దూరంగా జరిగిన ఎంపి తన మానాన తానుంటే సరిపోయేది. అయితే అలా ఉండకుండా ముందు ప్రభుత్వంపైన తర్వాత జగన్ పైన వ్యక్తిగతంగా కూడా తనిష్టం వచ్చినట్లు మాట్లాడారు.  అక్రమాస్తుల కేసుల విచారణను ఎదుర్కొంటున్న జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పెద్ద పోరాటమే చేస్తున్నారు.

నిజానికి ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంపికి లేనేలేదు. జగన్ తో పడలేదంటే కామ్ గా దూరంగా ఉండిపోతే సరిపోయేదేమో. కావాలని తెరవెనుక కొందరు జగన్ వ్యతిరేకులు ఆడించినట్లు ఆడుతుండటంతో వివాదం పెద్దదయిపోయింది. మరి పోరాటంలో జగన్ పై చేయి సాధిస్తారా ? లేకపోతే  ఎంపీనే విజయం సాధిస్తారో చూడాల్సిందే. 

మొదట నుంచి ఆయన రూట్ వేరు…

సొంత పార్టీ నాయకత్వంపై అమర్యాదగా ప్రవర్తించడం రఘురామజు ఈ మధ్యన చేయలేదు. ఏ వివాదాలు లేక ముందే ‘బొచ్చులో నాయకత్వం‘ అంటూ మొదటి సారి బయటపడ్డారు. కానీ ఆ తర్వాత మా జగన్ గారు మా బాస్ అంటూ లోపల బావాలను దాచిపెట్టి కృత్రిమంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అపుడే రఘురామరాజు రూటేంటో జనాలకు అర్థమైంది. అన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా కేవలం టెక్నికల్ దొరక్కుండా వ్యవహరిస్తూ రాజకీయ క్రీడ ఆడుతున్నారు రఘురామరాజు.