రామచంద్ర యాదవ్ ఎవరు? కొత్త పార్టీ ఎందుకు?

-

రామచంద్ర యాదవ్..ఇప్పుడు ఏపీ వార్తల్లో ఈయన పేరు ఎక్కువగానే వినిపిస్తుంది. ఇప్పటికే జగన్ వర్సెస్ చంద్రబాబు-పవన్ అన్నట్లు వార్ నడుస్తుంది. ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ అనే నాయకుడు ఎంట్రీ ఇచ్చారు. కొత్త పార్టీ పెట్టారు. అసలు ఈయన ఎవరు..ఎందుకు పార్టీ పెట్టారు. పార్టీ ఏం సాధించాలని అనుకుంటున్నారు. దీని వెనుక రాజకీయ కోణం ఏంటి అనేది ఒక్కసారి చూస్తే..రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి పుంగనూరుకు చెందిన నేత. ప్రముఖ పారిశ్రామికవేత్త.

గత ఎన్నికల్లో ఈయన జనసేన నుంచి పోటీ చేసి పుంగనూరులో కేవలం 16 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. తర్వాత ఆయన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం నేతలు దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడులని టి‌డి‌పి, జనసేన, బి‌జే‌పి సహ అన్నీ విపక్ష పార్టీలు ఖండించాయి. ఇక రామచంద్ర యాదవ్..బాగానే పలుకుబడి ఉన్న నేత..అందుకే అడగ్గానే ఈయనకు హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరికింది. అలాగే వై కేటగిరీ సెక్యూరిటీ లభించింది. దీంతో ఈయన బి‌జే‌పిలోకి వెళ్తారని అంతా అనుకున్నారు.

కానీ అనూహ్యంగా కొత్త పార్టీ ప్రకటించారు. భారత చైతన్య యువజన పార్టీ(బీసీవైపీ) అని పార్టీ పెట్టారు. బీసీలకు అధికారమే నినాదంగా పెట్టుకున్నారు. ఈయన వైసీపీనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అటు టి‌డి‌పిపై కూడా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈయన టార్గెట్ ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు. ముందు వైసీపీనే ప్రధాన టార్గెట్ అని తెలుస్తుంది. అందులో పెద్దిరెడ్డి ఫస్ట్ టార్గెట్. ఆయన్ని ఓడించాలని చూస్తున్నారు.

అయితే పార్టీ పెట్టినంత ఈజీగా..దాన్ని నిలబెట్టడం కష్టం . ఇప్పుడున్న పరిస్తితుల్లో ఆయన పార్టీ ప్రభావం కూడా చూపలేదు.వెనుక ఎలాంటి శక్తులు ఉన్నా సరే ఇప్పుడు ఉపయోగం లేదు. అలాగే ఆయన పెద్దిరెడ్డిని పుంగనూరులో కదపలేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version