ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీపై ట్విట్ వార్ కొనసాగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు. రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ కు ఉన్న నిబద్ధత తెలియకపోవడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ చేసిన కృషి గురించి మీ తండ్రిని అడగటం మంచిది అని… ఓహో రైతు సమస్యల పరిష్కారానికి బదులు రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉండొచ్చు..! అంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. నాలుగు కోట్ల ప్రజల 60 ఏళ్ల కలను నెరవేర్చింది కాంగ్రెస్ అని, మేము రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తీసుకువచ్చామని… మీ ప్రభుత్వం 7000కు పైగా రైతులను చంపిందని విమర్శించారు. హరిత విప్లవం, వ్యవసాయ భూమి సీలింగ్ చట్టం, భూమిలేని పేదలకు అసైన్మెంట్ భూములు, ఎంఎస్పీ, నిత్యావసర వస్తువుల చట్టం, పీడీఎస్, 70 వేల కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ, ఉపాధి హామీ పథకం, సమగ్ర పంటల బీమా, ఆహార భద్రతను తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఐకేపీ కేంద్రాల ఏర్పాటు చేయడానికి మీ ప్రభుత్వం నిరాకరించినప్పుడు మీరు బీజేపీతో ఫిక్స్డ్ బ్లేమ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీఈ, ఆర్టీఐ చట్టాలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు.
Mr. KTR,
It’s a pity that you’re unaware of Congress’s commitment to the welfare of farmers.
Better ask your father about our contributions.
Oh, he might be busy playing politics with farmer issues instead of resolving them..!
(1/4)
— Revanth Reddy (@revanth_anumula) March 30, 2022