హస్తంలో ‘రెడ్ల’ రగడ..రేవంత్ ప్లాన్ రివర్స్?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరగాల్సిందే అనుకుంటా…ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ..అధికార టీఆర్ఎస్ పై పోరాడటం కంటే…సొంత తగాదాలతో సతమతవుతుంది..నిత్యం పార్టీలో ఏదొక రగడ నడుస్తూనే ఉంటుంది. ఇప్పటికే నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది…పైగా రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక మరింత ఎక్కువగా రచ్చ జరుగుతుంది. సీనియర్లకు, రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పడని పరిస్తితి..బహిరంగంగానే వారి మధ్య ఫైట్ జరుగుతుంది. రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

అటు రేవంత్ సైతం పూర్తి స్థాయిలో సీనియర్లని బుజ్జగించడం, వారిని కలుపుకునిపోతున్నట్లు కనిపించడం లేదు…రేవంత్ తన స్టైల్ లో తాను రాజకీయం చేసుకుంటూ వెళుతున్నారు. ఇలా ఎవరిని పట్టించుకోకుండా రేవంత్ పనిచేసుకుంటూ వెళ్ళడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే..ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇలా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరుగుతుంది. సరే ఈ మధ్య రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి…కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఊపు తీసుకొచ్చారు. ఇక అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా పనిచేస్తూ…అధికార టీఆర్ఎస్ పై ఫైట్ చేస్తుందనుకునే లోపే..మళ్ళీ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు చెలరేగింది..తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు…పార్టీలో చిచ్చు పెట్టాయి.

రెడ్లకు పార్టీ పగ్గాలు ఇస్తేనే…పార్టీలకు మనుగడ అని రేవంత్ మాట్లాడారు..ఇక దీనిపై కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు వారు ఫైర్ అవుతున్నారు. సీనియర్ నేత మధుయాష్కీ లంటీ వారైతే బహిరంగంగా రేవంత్ వ్యాఖ్యలు ఖండించి..పార్టీలో అన్నీ కులాల వారు ఉన్నారని, అందరినీ రేవంత్ అవమానించారని మధుయాష్కీ ఫైర్ అయ్యారు.

అయితే రాష్ట్రంలో రెడ్ల అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా వస్తారనే కోణంలో రేవంత్ మాట్లాడినట్లు ఉన్నారు…కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది..సొంత పార్టీలోనే తిరుగుబాటు వచ్చింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కులాల కుంపటి చెలరేగిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news