రేవంత్ సీటు చేంజ్..కొడంగల్ ఫిక్స్ కాదా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ అయ్యే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి అనే చెప్పొచ్చు..ఈయన ఎప్పుడు ఏదోకరకంగా వార్తల్లోనే ఉంటారు..మొదట నుంచి దూకుడుగా రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ గానే ఉంటారు. ఇక టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తూ ముందుకెళుతున్నారు…నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు..అధికార టీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ…కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

revanth reddy

ఇలా పార్టీ కోసం రేవంత్ రెడ్డి పోరాడుతున్నారు…అదే సమయంలో తాను సొంతంగా బలపడే పయత్నాలు కూడా చేస్తున్నారు..ఇప్పటికే తనకంటూ సొంత బలాన్ని పెంచుకున్నారు. అయితే ఇలా సొంత బలంతో దూసుకెళుతున్న రేవంత్ రెడ్డి విషయంలో ఇటీవల కొత్త చర్చ నడుస్తోంది..పి‌సి‌సి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అనేది చాలా ముఖ్యం.

అయితే గత ఎన్నికల్లో ఈయన కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు..2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన రేవంత్, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. కొడంగల్ లో ఓడిపోయిన రేవంత్..2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇక ఆ తర్వాత నుంచి రేవంత్ పి‌సి‌సి అధ్యక్షుడుగా అయ్యి, ఏ స్థాయిలో రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలిసిందే.

ఇలా దూకుడుగా పనిచేస్తున్న రేవంత్ కు..కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే కాదు..తాను గెలవడం కూడా ముఖ్యం. అందుకే ఆయన ఈ సారి గెలవడానికి సీటు మార్చుకుంటున్నారని ప్రచారం వస్తుంది..ఈ సారి ఉప్పల్ లేదా ఎల్బీనగర్ లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఇవే…పైగా ఈ రెండిటిల్లో ఏదొక స్థానంలో పోటీ చేస్తే జి‌హెచ్‌ఎం‌సి లో కాంగ్రెస్ సత్తా చాటే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారట. అయితే ఇదంతా కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది..కానీ రేవంత్ మాత్రం కొడంగల్ లోనే పోటీ చేయాలని అనుకుంటున్నారని, ఓడిన చోటే గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారని, రేవంత్ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి చివరికి రేవంత్ ఏ సీటు ఫిక్స్ చేసుకుంటారో.