ఇప్పుడు ఏపీ సినీ నటుల రాజకీయం ఆసక్తికరంగా నడుస్తోంది. కొందరు సినీ నటులు రాజకీయాల్లో ఉండటంతో వారి మధ్య మాటల యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. ఏపీలో జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ ఉన్నారు..ఆయన సోదరుడు నాగబాబు జనసేనలో ఉన్నారు. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటు బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు రోజా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆలీ, పోసాని లాంటి వారు వైసీపీకి మద్ధతుగా ఉన్నారు.
ఇక కొందరు టీడీపీకి మద్ధతుగా ఉంటే..మరికొందరు జనసేనకు మద్ధతుగా ఉన్నారు. అయితే ఒకే ఇండస్ట్రీలో పనిచేసిన వారు ఇప్పుడు రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రోజా..పవన్‌తో పాటు నాగబాబు, చిరంజీవిని టార్గెట్ చేసి ఎలా విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. అలాగే నాగబాబు సైతం రోజా టార్గెట్ గా ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో పవన్ సన్నిహితుడుగా ఉన్న ఆలీ సైతం రాజకీయం నేర్చుకున్నారు. వైసీపీలో ఈ మధ్యే కీలక పదవి పొందిన ఆలీ..పవన్ టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ చెబితే పవన్‌పై పోటీకి సిద్ధమని ఆలీ ప్రకటించారు.
దీంతో ఆలీపై పవన్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇక సినీ రంగంలో ఉంటూ మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేసేవారు సైతం రోజా, ఆలీకి కౌంటర్లు ఇస్తున్నారు. జనసేన పార్టీకి సపోర్టుగా తమ కుటుంబం మొత్తం ఉంటామంటూ నటుడు శివబాలాజీ ప్రకటించారు. అవసరమైతే ఎన్నికల్లో జనసేన తరుపున క్యాంపైన్ చేస్తామని అన్నారు.
అటు రోజా వ్యాఖ్యలకు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు. “మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ లో ఏమి లేకుండా చేస్తారు అనే ఈ చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ” అని రోజా అనగా, దానికి కౌంటరుగా “నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ క్యాంపైన్ చెయ్యమని కానీ, పార్టీలో చేరమని కానీ, అడగలేదని, చిన్నఆర్టిస్ట్‌లే కదా.. అంత భయపడతారెందుకు.” అంటూ బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి సినీ రంగంలో కూడా రాజకీయం మొదలైంది.