ఈట‌ల‌నే గెల‌వాల‌ని కోరుకుంటున్న ఆర్.ఎస్‌.పీ.. కార‌ణ‌మేంది..

ఇప్పుడు హుజూరాబాద్ అంటే తెలంగాణ‌లో ఎంత హాట్ టాపిక్‌గా న‌డుస్తుందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో రెండు ప్ర‌ధాన పార్టీలు అయిన టీఆర్ ఎస్‌, బీజేపీ ఎంత‌లా దూసుకుపోతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈట‌ల రాజేంద‌ర్ ను ఓడించేంద‌కు టీఆర్ స్ త‌న ద‌గ్గ‌ర ఉన్న అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగిస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టికే ద‌ళిత‌బంధు లాంటి స్కీమ్ ను కూడా తీసుకువ‌చ్చింది. అయినా కూడా ఈట‌ల‌కు మాత్రం మొద‌టి నుంచి పార్టీల‌కు అతీతంగా మద్ద‌తు వ‌స్తూనే ఉంటోంది.

etala
etala

ఇక ఆయ‌న బీజేపీలో ఎప్పుడైతే చేరారో అప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల నుంచి కొంత గ్యాప్ పెరుగుతూ వ‌స్తోంది. ఎందుకంటే ఆయ‌న ఏ పార్టీలో చేర‌క ముందు ఉన్న గుర్తింపు బీజేపీలో చేరిన త‌ర్వాత త‌గ్గింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ కూడా ఈట‌ల‌కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌డం కార‌ణంగా ఈట‌ల ఇమేజ్ కొన్ని వ‌ర్గాల్లో త‌గ్గుతోంద‌ని తెలుస్తోంది. ఇలాంటి స‌మ‌యంలోనే ఆయ‌నకు మంచి భ‌రోసా దొరికింది.

అదేంటంటే బీఎస్పీ కీల‌క నేత, మాజీ ఐపీఎస్ అయిన ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఆయ‌న వైపు బ‌హుజ‌నులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ఆయ‌న ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏకంగా ఈట‌ల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతూ వ‌స్తున్నారు ఆర్ ఎస్పీ. ఇందులో భాగంగా నిన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌. కృష్ణ‌య్య‌తో క‌లిసి ఈట‌ల‌కు త‌మ మ‌ద్ద‌తు అన్న‌ట్టు వ్యాఖ్యానించారు. కేసీఆర్ బీసీల‌ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నార‌ని కూడా చెప్ప‌డం ఇప్పుడు ఈట‌ల‌కు క‌లిసి వ‌చ్చే అంశం.