సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కూడా తెగించిందా

-

నాగార్జున్ సాగర్‌ ఉప ఎన్నికలో అధికార పార్టీకి ధీటుగా ముందుకు వెళ్తుంది కాంగ్రెస్‌ పార్టీ. రాష్ట్ర రాజకీయాల్లో పట్టు నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉండటంతో సర్వశక్తులు ఒడ్డుతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రచారం చివరి దశకి చేరడంతో పోల్ మెనేజ్ మెంట్ దృష్టి పెట్టిన హస్తం పార్టీ రాష్ట్రస్థాయి నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు సాగర్ చుట్టు మొహరించింది. కీలక సమయంలో విజయం దక్కకుంటే కాంగ్రెస్ ఉనికి కే ప్రమాదం పొంచి ఉండటంతొ‌ చావో‌రేవో తేల్చుకునేందుకు‌ తెగించి సిద్దమయ్యారు కాంగ్రెస్ నేతలు.

 

 

 

 

 

 

 

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరడంతో పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిపెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే రాష్ట్ర నేతలంతా అక్కడే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తుండగా..ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ ఠాగూర్ ను కూడా రంగంలోకి దిగారు. ఉప ఎన్నికల ప్రచార గడువు ఈ ఒక్కరోజే ఉండటంతో రోజంతా నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి ద్వితియ శ్రేణి నాయకులను సమన్వయం చేస్తూ పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెట్టింది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ప్రచారసరళిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు.

కేసీఆర్ సభ అనంతరం సాగర్ లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు పలు కీలల విషయాల పై చర్చించారు. పోలింగ్ ముగిసే వరకు నాయకులు ఎవరు హైదరాబాద్ వెళ్లొద్దు అన్నారు సూచించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. సాగర్ నియోజకవర్గ పరిధిలో పొరుగున ఉండమని శ్రేణులకు సూచించిన ఉత్తమ్ టీఆర్ఎస్ ఏ స్థాయికి వెళ్తే.. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలన్నారు. మనకు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్య అన్నారు. కేసీఆర్ ఊహించిన స్థాయిలో హాలియా సభ జరగలేదన్న రేవంత్ రెడ్డి దీని ప్రభావం పోలింగ్ మీద ఉంటుందన్నారు. కెసిఆర్ వ్యవహార శైలి…డిఫెన్స్ శైలిలో ఉందన్నారు. పక్క రాష్ట్రం పోలీసులతో డిప్యుటేషన్ డ్యూటీలు వేయించి ఎన్నిక‌ నిర్వహించాలని కేసీఆర్ చూస్తున్నరన్నారు. అధికారపార్టీ పోలీసుల ద్వారా ఎన్నికలు మేనేజ్ చేయాలని చూస్తుందని రెండు రోజులు పార్టీ నాయకులు అలెర్ట్ గా ఉండాలన్నారు. మీ అందరికీ మేము అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు రేవంత్.

నిన్న జరిగిన కేసీఆర్ సభ సైతం ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంతొ ఎన్నిక పై ఇంకాస్త సీరియస్ గా‌ దృష్టిసారించారు టీ కాంగ్రెస్ నేతలు. ఇటు పార్టీకి.. అటు సీనియర్‌ నేత జానారెడ్డికీ సవాల్‌ గా మారిన నాగార్జున సాగర్ బై పోల్‌లో గట్టి వ్యూహంతో ముందుకెళ్తున్న హస్తం పార్టీకి.. ఇసారైనా గెలుపు దక్కుతుందో లేదో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news