రోజురోజుకూ ఏపీలో టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికల్లో క్రమ క్రమంగా ఇంకా వెనకబడుతోంది. ఇక వైసీపీ అయితే తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఇక తాజాగా వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అది మరోసారి కనిపించింది. కాగా ఏకంగా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలనే టీడీపీ సత్తా చాటలేకపోయిందంటే పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క చంద్రబాబు విషయంలోనే కాదు టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి.
ఒకప్పుడు కుప్పం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసిన టీడీపీ ఇప్పుడు అడ్రగ్ గల్లంతు అయిందంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబు నియోజకవర్గంలోనే కాకుండా ఏపీలో చాలా వరకు టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో అదికూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఇలాంటి పరిస్థితి ఉండటం గమనార్హం. ఇలాంటి అన్ని కీలకమైన చోట్ల కూడా వైసీపీ హవా కొనసాగింది.
ఇక ఇందులో మరీ ముఖ్యంగా బాలకృష్ణ నయోజకవర్గం అయిన హిందూపురం, అలాగే రాప్తాడు, తాడిపత్రి నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఇక ఇలా ఎందుకు ఓడిపోయిందంటే మాత్రం తాము ఎలక్ష్లను బహిష్కరించామని కూడా చెబుతున్నారు టీడీపీ ఓడిన నేతలు. కాగా తాడిపత్రి మున్సిపల్ పీఠాన్ని కైవలం చేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ స్థానిక ఎన్నికల్లో మాత్రం హవా సాగించలేకపోయారు. రూరల్ ఏరియాల్లో సత్తా చూపించలేకపోయారు. మొత్తంగా రూరల్ ఏరియాల్లో వైసీపీ సునామీ సృష్టించందని చెప్పాలి.