అసెంబ్లీలో తన్నులాట..దిగజారిన నేతలు..తప్పు ఎవరిది!

-

ఏపీ అసెంబ్లీని నాయకులు రోజురోజు దిగజారుస్తున్నారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన దేవాలయం లాంటి అసెంబ్లీలో నేతలు బూతులు మాట్లాడటమే కాదు..ఆఖరికి కొట్టుకునేవరకు వెళ్ళిపోయారు. ఎవరు ఎవరిపై దాడి చేశారనేది క్లియర్ గా బయటకు రాలేదు గాని..తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని టి‌డి‌పి వాళ్ళు..కాదు కాదు తమ ఎమ్మెల్యేలపై టి‌డి‌పి ఎమ్మెల్యేలు దాడి చేశారని వైసీపీ వాళ్ళు చెబుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు అసెంబ్లీలో టి‌డి‌పి వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఇక అసెంబ్లీలో వరుసపెట్టి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల మాట్లాడటం తప్ప టి‌డి‌పి ఎమ్మెల్యేలకు మైకు ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ఇక మైకు కోసం వరుసగా నిరసనలు తెలియజేయడం..టి‌డి‌పి ఎమ్మెల్యేలు సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. ఇదే తరహాలో నేడు జీవో నెంబర్ 1పై టి‌డి‌పి ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియం చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు వచ్చి..టి‌డి‌పి ఎమ్మెల్యే స్వామిని కిందకు తోసేశారని తెలిసింది. ఇక పోడియం కింద ఉన్న టి‌డి‌పి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ ప్లకార్డు లాక్కుని ఆయన్ని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నెట్టేశారని సమాచారం. అయితే టి‌డి‌పి ఎమ్మెల్యేలు ప్రతిఘటించినట్లు తెలిసింది. ఇలా రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఇక తమ ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా టి‌డి‌పి ఎమ్మెల్యేలు అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు అంటున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ పై దాడి చేశారని…ఇది అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు అని వైసీపీ అంటుంది. కానీ ఏదేమైనా గాని రెండు పార్టీలు మాత్రం అసెంబ్లీని భ్రష్టు పట్టించారని చెప్పవచ్చు. ఇంకా ఇందులో ఎవరిది తప్పు అనేది తేలాలంటే అసెంబ్లీలో ఏం జరిగిందో వీడియోలు బయటకు రావాలి.

Read more RELATED
Recommended to you

Latest news