ఆదిలాబాద్‌లో త్రిముఖం..రామన్నకు చెక్ పడుతుందా?

-

ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం ఒకప్పుడు ఇండిపెండెంట్లుగా అడ్డాగా ఉన్న స్థానం..ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ పార్టీ హవా నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్లు ఎక్కువసార్లు సత్తా చాటారు. 5 సార్లు వరకు ఇక్కడ ఇండిపెండెంట్లు గెలిచారు. మూడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు టి‌డి‌పి గెలిచింది. ఇక గత మూడు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. అది కూడా జోగు రామన్న వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

సర్పంచ్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థాయి నుంచి జోగు రామన్న ఎదుగుతూ వచ్చారు. టీడీపీలో రాజకీయ జీవితం విజయవంతంగా నడిచింది. ఇక 2009 ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టి‌డి‌పి తరుపున గెలిచారు. ఇక తెలంగాణ ఉద్యమం ఊపు అందుకున్న నేపథ్యంలో ఈయన టి‌డి‌పికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బి‌ఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఈ క్రమంలో 2012 ఉపఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో మరోసారి సత్తా చాటారు..అదే ఊపుతో 2018 ఎన్నికల్లో కూడా జోగు రామన్న గెలిచారు. ఇలా వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

jogu

అయితే ఈ సారి కూడా ఆదిలాబాద్ లో జోగు గెలిచేస్తారా? అంటే గెలిచే అవకాశాలు లేకపోలేదు గాని..ఈ సారి గెలవడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే బి‌జే‌పి, కాంగ్రెస్ నుంచి ఆయన గట్టి పోటీ ఎదురుకోవాల్సి ఉంది. ముఖ్యంగా బి‌జే‌పి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం బి‌జే‌పి గెలుచుకుంది. అదే సమయంలో ఆదిలాబాద్ అసెంబ్లీలో బి‌జే‌పికి లీడ్ వచ్చింది. అంటే అక్కడ బి‌జే‌పి హవా పెరిగింది.

2018 ఎన్నికల్లో బి‌జే‌పిపై జోగు 26 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఆ మెజారిటీ తగ్గుతూ వస్తుంది. అటు కాంగ్రెస్ రేసులో ఉంది. దీంతో ఈ సారి ఆదిలాబాద్ లో త్రిముఖ పోరు జరిగేలా ఉంది. మరి చూడాలి ఆదిలాబాద్ లో ఈ సారి జోగుకు చెక్ పడుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news