తమ్ముడు ఓటమి కోసం అన్న..?

-

మొత్తానికి అనేక ట్విస్ట్‌లు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో కాంగ్రెస్ తరుపున ప్రచారానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ప్రియాంక గాంధీతో భేటీ అయ్యాక…కోమటిరెడ్డి దగ్గర నుంచి క్లారిటీ వచ్చింది..ఆయన చెప్పాల్సినవి ప్రియాంకకు చెప్పేశారు. అలాగే ఇకపై కాంగ్రెస్ లో పనిచేస్తానని, మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. ఇక తాజాగా కోమటిరెడ్డిని భట్టి విక్రమార్క కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు అభ్యర్థి ఎంపికపై వెంకట్ రెడ్డి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.

ఇదే క్రమంలో వెంకటరెడ్డి స్పందిస్తూ… మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ఎంపిక చేసినా అభ్యంతరం లేదని, అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. మునుగోడు ప్రచారానికి సరైన సమయం చూసుకుని వెళ్తానని చెప్పారు. అయితే ఇప్పటివరకు వెంకటరెడ్డి విషయంలో స్పష్టత రాలేదు…రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది.

అలాగే రేవంత్ టార్గెట్ గా వెంకన్న ఫైర్ అవుతూ వచ్చారు…దీంతో వెంకన్న కాంగ్రెస్ ని వీడటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యాక వెంకన్న వర్షన్ మారింది. మునుగోడు ప్రచారానికి కూడా వెళ్తానని అన్నారు. మరి వెంకన్న మునుగోడు ప్రచారానికి వెళ్తారో లేదో ఇప్పటికీ కాంగ్రెస్ శ్రేణులకు అనుమానంగానే ఉంది. ఎందుకంటే అటు పక్క ఉంది తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి. బీజేపీ తరుపున నుంచి బరిలో దిగుతున్న రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెంకన్న పనిచేస్తారా? ఆయన ఓటమి కోసం పనిచేస్తారా? అనేది పెద్ద డౌట్.

ఎన్నికల ప్రచారానికి వెళ్తానని అన్నారు గాని…అసలు వెళ్తారో లేదో తెలియడం లేదు. ఏదో మీడియా వరకు ఆ మాట చెప్పినట్లే తెలుస్తోంది. ఎందుకంటే తమ్ముడుకు వ్యతిరేకంగా వెంకన్న ప్రచారం ఉండటం కష్టమే. మొత్తానికైతే తమ్ముడు ఓటమి కోసం వెంకన్న పనిచేయరనే చెప్పొచ్చు. మరి మునుగోడు ఫలితం తర్వాత వెంకన్న పూర్తి క్లారిటీ ఇవ్వొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news