ఏ ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డిని ప్రకటించారో… మాకు తెలియదు: జగ్గా రెడ్డి

-

చాలా రోజులుగా ఊరించిన.. టీపీసీసీ అధ్యక్ష పీఠం పై కసరత్తు పూర్తి చేసిన కాంగ్రెస్ అధిష్టానం మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు ఇస్తూ… నిర్ణయం తీసుకుంది. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు కాంగ్రెస్ నేతలు బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట రాజకీయాల్లో అందరికీ సుపరిచితమయిన వ్యక్తి సంగా రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి. ఓపెన్ గా మాట్లాడే జగ్గా రెడ్డి పీసీసీ చీఫ్ నియామకంపై తన నిర్ణయాన్ని ప్రకటించారు.

జగ్గా రెడ్డి
jagga-reddy

ఏ ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించారో తమకు అర్థం కావడం లేదంటూ… కుండ బద్దలు కొట్టారు. రేవంత్ రెడ్డి నియామకాన్ని జగ్గా రెడ్డి మొదటి నంచి వ్యతిరేఖిస్తూ.. వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో జగ్గా రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. చాలా మంది కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడవడం మొదటి నుంచి నచ్చడం లేదు కావచ్చు. అందుకోసమే చాలా మంది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని వ్యతిరేఖిస్తూ.. అధిష్టానానికి పలు సందర్భాల్లో లేఖలు రాశారు. మీడియా సమావేశాల్లో కూడా.. రేవంత్ రెడ్డి నాయకత్వం పై విమర్శలు గుప్పించారు.

రేవంత్ రెడ్డి విషయంలో నచ్చకపోయినా.. తాము మాత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో పని చేస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేస్తామని తెలిపారు. పీసీసీ పదవి కోసం ఆశలు పెట్టుకున్న వారిలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కూడా ఉన్నారు. కానీ ఈయన ఆశలకు అధిష్టానం బ్రేకులు వేస్తూ… పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. ఆల్రెడీ కాంగ్రెస్ లో కొంత మంది నేతలు ఈ విషయం పై రాజీనామాలు కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news