కమలం-కాంగ్రెస్‌ల మధ్యలో కారుకు అడ్వాంటేజ్ అవుతుందా?

-

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్…ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా నడుస్తున్న విషయం తెలిసిందే. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ…తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే దుబ్బాక ఉపఎన్నికలో కారు పార్టీని చిత్తు చేసింది. అలాగే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఊహించని విధంగా 48 సీట్లు దక్కించుకుని సత్తా చాటింది.

 

ఇలా బీజేపీ సాధిస్తున్న విజయాలని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కమలం పార్టీ అని విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే కమలం ఈ రేంజ్‌లో పుంజుకోవడానికి కాంగ్రెస్ కూడా ఒక కారణం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన కాంగ్రెస్, తర్వాత నుంచి వీక్ అవుతూ వచ్చింది. కేసీఆర్ వరుస పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తమ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో హస్తం పార్టీ ఇబ్బందుల్లో పడిపోయింది. అదే సమయంలో ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా పెద్ద మైనస్ అయ్యాయి.

దీంతో కేంద్రంలో అధికారంలో బీజేపీ తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుంది. ఇలా తెలంగాణలో బలపడిన కమలం పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టగలదా? అంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఏది చెప్పలేని పరిస్తితి ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ మాదిరిగా బీజేపీ రాష్ట్రం మొత్తం బలపడలేదు. ఏదో కొన్ని జిల్లాల వరకే బీజేపీ బలం పుంజుకుందని చెప్పొచ్చు.

అయితే కాంగ్రెస్‌లో నాయకులు వీక్‌గా ఉన్న ఆ పార్టీ కేడర్ మాత్రం స్ట్రాంగ్‌గానే ఉంది. కాంగ్రెస్ కూడా పలు జిల్లాల్లో స్ట్రాంగ్‌గా ఉంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల్లో హస్తంకు కాస్త బలం ఉంది. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. కాబట్టి ఆ పరిస్తితిని చూస్తే రాష్ట్రంలో బీజేపీకి పూర్తి బలం రాలేదు. అలా అని కాంగ్రెస్ పూర్తిగా వీక్ కాలేదు. కాకపోతే ఈ రెండు పార్టీలు ఇలా పూర్తిగా బలోపేతం కాకపోవడం వల్ల నెక్స్ట్ టీఆర్ఎస్‌కే అడ్వాంటేజ్ ఉండేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news