వైసీపీకి కోటంరెడ్డి గుడ్‌బై..టీడీపీలోకి జంప్..బాబు చేతుల్లోనే!

-

ఇంతకాలం వైఎస్ జగన్‌కు వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తనపై అనుమానంతో తన ఫోన్‌ని ట్యాప్ చేశారని, ఇంత అవమానం జరిగాక తాను వైసీపీలో ఉండలేనని, ఇంకా వైసీపీని వీడుతున్నానని ప్రకటించారు. అలాగే తన అనుచరులతో టీడీపీలో చేరుతున్నట్లు చెప్పానని, ఇక  తాను పోటీ చేసే అంశానికి సంబంధించి చంద్రబాబుదే తుది నిర్ణయమని సంచలన ప్రకటన చేశారు.

అయితే గత కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఓ వైపు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి, మరో వైపు కోటంరెడ్డిలు..వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధి పనులు అవ్వడం లేదని, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం లేదని, అధికారులు సహకరించడం లేదని ఫైర్ అవుతున్నారు. ఇలాగే అయితే నెక్స్ట్ అధికారంలోకి రాలేమని ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆనంకు చెక్ పెడుతూ ఆయన నియోజకవర్గంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. అలాగే ఆయన సెక్యూరిటీ తగ్గించారు. దీంతో ఆనం వైసీపీకి దూరమయ్యారు.

కానీ కోటంరెడ్డిని జగన్ పిలిపించుకుని మాట్లాడారు..దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాత రచ్చ మొదలైంది..తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పి కోటంరెడ్డి..తన సన్నిహితుడుతో మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. దీనిపై కోటంరెడ్డి వివరణ ఇస్తూ..నిజంగానే తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆధారాలతో సహ నిరూపిస్తానని సవాల్ చేశారు.

దీనికి కౌంటరుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధారాలు చూపించాలని అన్నారు. దీంతో తాజాగా ప్రెస్ మీట్ పెట్టి కోటంరెడ్డి..తన ఫోన్, తన ఫ్రెండ్ ఫోన్..ఐఫోన్లు అని రికార్డింగ్ అవ్వదని, అలాంటిది తమ ఆడియో బయటకొచ్చిందంటే అది ట్యాపింగ్ అని చెప్పుకొచ్చారు. అలాగే తనతో ఇంటిలిజెన్స్ చీఫ్ సైతం మాట్లాడారని చెప్పి  ఓ ఫోన్ నెంబర్‌ని బయటపెట్టారు. ఇక చివరిగా తాను వైసీపీలో ఉండలేనని, టీడీపీలో చేరేది లేనిది చంద్రబాబు నిర్ణయం మీద ఆధారపడి ఉందని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news