కాసేపటి క్రితమే బీసీసీఐ సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఆస్ట్రేలియా తో స్వదేశంలో ఆడనున్న వన్ డే లకు ఇండియా జట్టును ప్రకటించింది. ఇందులో షాకింగ్ ఎంపికలు ఏమీ లేకపోయినా ఒకే ఒక్క ఎంపిక మాత్రం ప్రేక్షకులకు సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి. మొదటి రెండు వన్ డే లకు కె ఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, ఆఖరి వన్ డే కుమాత్రం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండనున్నారు. కాగా ఈ రెండు జట్లలో ఇండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా చోటు దక్కించుకోవడం విశేషం. అశ్విన్ చివరగా వన్ డే మ్యాచ్ ను ఆడి 22 నెలలు కావస్తోంది. లెఫ్ట్ ఆర్మ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు దూరం కావడంతో అశ్విన్ ను జట్టులోకి తీసుకున్నారు.
ఇక లెగ్ స్పిన్నర్ యఙవేంద్ర చాహల్ కు ఇంకా బ్యాడ్ టైం నడుస్తోంది. మళ్ళీ వచ్చే ఐపీఎల్ లో చాహల్ నిరూపించుకునే వరకు ఇతనికి ఛాన్స్ దక్కడం కష్టం అని తెలుస్తోంది.