‘టిల్లూ స్క్వేర్’లో నటించనున్న రాధిక….?

-

సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘డీజే టిల్లూ’. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. రాధిక, టిల్లూ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్గా నిలిచాయి. ఈ సినిమాకు కొనసాగింపుగా మల్లిక్ రామ్ డైరెక్షన్ లో ‘టిల్లూ స్క్వేర్’ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలోనూ రాధిక పాత్ర ఉంటుందని, సినిమాకు ఇదే కీలకమని సినీవర్గాలు పేర్కొన్నాయి.మొత్తం 15 నిమిషాల పాటు టిల్లు- రాధికాకి మ్యాడ్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది.

 

టిల్లు స్క్వేర్ లో కూడా రాధికా ఉంటుందని తెలుసుకుని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.అయితే మార్చి 29న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version