రాహుల్‌కు కేజీఎఫ్ ఎలివేషన్స్‌తో చిక్కులు..పోలిటికల్ చెక్?

-

భారతదేశ సినీ రంగంలో కేజీఎఫ్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్ట్ 1, 2లుగా వచ్చిన  కేజీఎఫ్ సినిమా భారీ వసూళ్లని రాబట్టింది. పాన్ ఇండియా సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయనం సృష్టించింది. కన్నడ రంగానికి చెందిన ఈ కేజీఎఫ్ సినిమా..దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇక ఆ సినిమాకు సంబంధించిన పాటలు గాని, బ్యాగ్రౌంగ్ మ్యూజిక్ గాని..ఒక సెన్సేషన్.

ఆ పాటలని, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో కోట్ల మంది రీల్స్ చేశారు..అలాగే అన్నిచోట్ల వాడేస్తున్నారు. ఇక రాజకీయ నాయకులైన, ఇతర వర్గాలకు చెందిన ప్రముఖులైన..తమని తాము హైలైట్ చేసుకోవడం కోసం.. కేజీఎఫ్ సినిమా పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ని వాడుకుంటున్నారు. అయితే ఎంతమంది వాడిన సరే కాపీ రైట్స్ గురించి ఎలాంటి చర్చ లేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ వాడటంపై బెంగళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ (MRT Music) సంస్థ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియా శ్రీనటే.. కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ కంప్లైంట్ చేసింది. కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునేందుకు పెద్ద మొత్తంలో చెల్లించామని, కానీ వాటిని రాహుల్ యాత్రలో వాడుతున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో రాహుల్ గాంధీ సహా ఇతర నేతలపై కేసు నమోదయ్యింది. అయితే ఈ కాపీ రైట్స్ కేసు వెనుక రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇంతవరకు కాపీ రైట్స్ అని ఫిర్యాదు చేయని ఆ సంస్థ..రాహుల్ యాత్రలోనే వాడుతున్నారని ఫిర్యాదు చేసిందని అంటున్నారు.

అయితే ప్రస్తుతం రాహుల్ యాత్ర…తెలంగాణలోని మెదక్ జిల్లాలో కొనసాగుతుంది..రాహుల్ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. రాహుల్ సైతం ప్రజలని ఆకర్షించేలా ముందుకెళుతున్నారు. మరి ఇలాంటి సమయంలో కాపీ రైట్స్ కేసు విషయంలో కాంగ్రెస్ ఎలా ముందుకెళుతుందో చూడాలి.

ReplyForward

Read more RELATED
Recommended to you

Exit mobile version