ఏపీకి రెయిన్ అలర్ట్…రాబోయే 48గంటల్లో భారీ వర్షాలు..!

-

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరదలకు పలువురు మరణించడం తో పాటు పంట నష్టం కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నిన్న సీఎం జగన్ ముంపు గ్రామాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇక మరో 48గంటల్లో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Rain alert for andhrapradesh

రాయలసీమలో పలు చోట్ల కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతే కాకుండా తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణ లోనూ నిన్నటి నుండి వర్గాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్న పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version