18 నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు..

-

వర్షకాల పార్లమెంటు సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ షెడ్యూల్ విడుదల చేసింది. జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 12తో ముగియనున్నాయి. ఈ తేదీలతో ఇటీవల పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ ప్రతిపాదనలు చేసింది. కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇప్పుడున్న భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో జరగనున్నాయి.

Women lawmakers to pass a resolution demanding 33% reservation for women in  Parliament | India | Onmanorama

ఇక, పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పటికే ఎన్డీఏ తరుఫున రాష్ట్రపతి ఎన్నికల బరిలో ద్రౌపది ముర్ము ఉండగా.. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా బరిలో దిగారు. ఈ ఏడాది రాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికకు కూడా షెడ్యూల్‌ విడుదలైంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవికాలం ముగుస్తుండడంతో కొత్తగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుల చేసిన ఎన్నికల సంఘం.

 

Read more RELATED
Recommended to you

Latest news