IPLలో ఈ సాంగ్​పై డ్యాన్స్ చేయాలనుకున్నా.. కానీ : రష్మిక మందన్న

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాపులారిటీ గురించి చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ భామకు సూపర్ క్రేజ్ ఉంది. అందుకే ఈ బ్యూటీకి అవకాశాలు కూడా ఎక్కువే. తాజాగా ఈ భామకు ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో పర్ఫామెన్స్ చేసే అవకాశమొచ్చింది. శుక్రవారం రోజున అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ సీజన్ 16 ఆరంభ వేడుకల్లో రష్మిక తన డ్యాన్స్​తో అదరగొట్టింది.

‘పుష్ప’లోని ‘సామి’, ‘శ్రీవల్లి’ హిందీ పాటకు, ఇటీవల ఆస్కార్‌ పురస్కారం పొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకు రష్మిక మందన్న ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. ఈ బ్యూటీ డ్యాన్స్ వీడియోలు ఇప్పుుడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక మరోసారి అదరగొట్టింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ మా మనసు దోచేసిందంటూ హార్ట్ ఎమోజీలతో ప్రేమను కురిపిస్తున్నారు.

అయితే రష్మిక ఐపీఎల్​లో తన పర్ఫామెన్స్ గురించి ఓ ట్వీట్ చేసింది. తాను ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో వారిసు సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేద్దామని అనుకున్నానని.. కానీ సమయం లేకపోవడం వల్ల చేయలేకపోయానని చెప్పింది. అయితే తన అభిమానుల కోసం ఆ పాటపై డ్యాన్స్ చేసి వీడియోను ట్విటర్​లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది

Read more RELATED
Recommended to you

Exit mobile version