ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల జగనన్న అమ్మవడి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగ గత కొద్ది రోజుల నుంచి అమ్మవడి పథకంపై జగన్ సర్కార్ ఆంక్షలు విధించిందనే వార్త తెగ చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియా లో అమ్మవడి పథకంపై ఆంక్షల గురించి చాలా మంది నెటిజన్లు ప్రస్తావించారు. అయితే ఈ వార్తలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.
అలాగే జగనన్న అమ్మ వడి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. టీడీపీ నాయకులు ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దమ్ముంటే.. తమ ప్రభుత్వం అమ్మవడి పథకంపై ఆంక్షలు విధించినట్టు చంద్రబాబు. నారా లోకేష్ నిరూపించాలని సవాల్ చేశారు. అమ్మవడి పథకానికి తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.13 వేల కోట్లను ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 శాతం మంది అమ్మవడి తీసుకున్నారని వెల్లడించారు.