కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ ను విసిరిన రేవంత్… రక్త పరీక్షలకు సిద్ధం !

-

పరస్పర ఛాలెంజ్‌ లతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కాయి. మంత్రి కేటీఆర్‌ వైట్‌ ఛాలెంజ్‌ కు రావాలని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తాను వైట్ ఛాలెంజ్ సిద్దమని..తాను కెటిఆర్ కి వైట్‌ ఛాలెంజ్ విసురుతున్నానని పేర్కొన్నారు. తాను రక్త నమూనాలు ఇస్తానని… ఆ తర్వాత విశ్వేశ్వర రెడ్డీ మరియు కేటీఆర్ ఇవ్వాలన్నారు.

కేటీఆర్ అందుకు సిద్దమా ? మీరు రక్త నమూనాలు ఇచ్చి… ఛాలెంజ్ విసురాలని సవాల్‌ విసిరారు రేవంత్‌ రెడ్డి. ఏ డాక్టర్ దగ్గర టెస్ట్ ఇచ్చి రా అంటే అక్కడ ఇచ్చి వస్తానని… కేటీఆర్ ఎప్పుడు తేదీ ప్రకటిస్తే.. అప్పుడే వెళ్లి రక్త నమూనాలు ఇస్తానని స్పష్టం చేశారు రేవంత్‌ రెడ్డి. డ్రగ్స్ కేసులో నికు సంబంధం లేదు అంటున్న కేటీఆర్… Ed కి సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని చురకలు అంటించారు. వివరాలు ఇవ్వలేం అని కోర్టు కి ఎందుకు చెప్తున్నారని మండి పడ్డారు. మీరెందుకు భయపడుతున్నారని… ఎక్సైజ్ శాఖ విచారణ లో ఎందుకు రకుల్ ప్రీత్ సింగ్ లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version