యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. జాతీయ స్థాయిలో జగన్, అసదుద్దీన్ ను ఎందుకు కలుపుకోవడంలేదు ? అని నిలదీశారు. కేసీఆర్ ప్రతీ చర్య.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికే.. ఇలా చేస్తున్నాడని ఆగ్రహించారు. కేసీఆర్ మోదీని ఓడించాలనుకుంటే… బీజేపీ భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాలని కోరారు.