ఫార్ములా రేస్ విషయంలో బెడిసికొట్టిన రేవంత్ ప్లాన్?

-

గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కోసం రూ.55 కోట్లు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.ఈ కేసులో కేటీఆర్ అరెస్టు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి కుండబద్దలు కొట్టారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడినట్లు సమాచారం. ఇప్పుడు కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ రేస్ కోసం కాకుండా రూ.55 కోట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం ఖర్చు చేసినట్లు స్లోగన్ మార్చాలని సీఎం రేవంత్ పార్టీ నేతలకు సూచించినట్లు కథనాలు వస్తున్నాయి. క్రీడల కోసం ప్రభుత్వాలు ఖర్చు పెడతాయని మాజీ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇవ్వడంతో పాటు పెట్టుబడులు ఎంతమేర వచ్చాయో వివరించే ప్రయత్నం చేయడంతో ప్రజల ఆలోచన వైఖరి మారినట్లు సమాచారం. దీంతో కేటీఆర్ అరెస్టుపై రేవంత్ టీం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version