సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇండియా పై ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి మనకు తెలిసిందే. టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో రాహుల్,రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ మినహాయించి ఎవ్వరు అంతగా రాణించలేకపోయారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి ఇన్నింగ్స్ లో ఐదు పరుగులు చేయగా రెండవ ఇన్నింగ్స్ లో డక్ అవుట్ గా వెనిదిరిగాడు. దీంతో భారత బ్యాటర్లలకు పేస్, బౌన్స్ లను ఎలా ఎదురుకోవాలో తెలియదు అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో భారత జట్టుపై వస్తున్న విమర్శలకు రోహిత్ శర్మ స్పందిస్తూ…. తమకు విదేశాలలో ఎలా ఆడాలి అనే విషయం తెలుసన్నారు. గతంలో ఆస్ట్రేలియా ,ఇంగ్లాండ్ పర్యటనలో సాధించిన విజయాలను ఒకసారి పరిశీలించాలని అన్నాడు. అయితే మేము దక్షిణాఫ్రికా తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయామని అన్నాడు. అదే సమయంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో మేము సిరీస్ లను గెలిచామని కొన్నింటిని డ్రా కూడా చేసుకున్నామని పేర్కొన్నారు. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన చేసిందని కొన్ని సందర్భాలలో ఇటువంటి ఫలితాలు ఎదురవడం సాధారణమని రోహిత్ శర్మ అన్నాడు. అంతేకానీ విదేశాల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో తెలియక కాదన్నాడు.