మరో రికార్డ్ చేరువలో రోహిత్ శర్మ

-

ఇంగ్లాండ్తో జరగబోయే నాలుగో టెస్ట్ కు ముందు రోహిత్ శర్మ మరో రికార్డు కి చేరువలో ఉన్నాడు.రాంచీ వేదికగా రేపటి నుంచిఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 7 సిక్సర్లు బాదితే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 600 సిక్స్‌ల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పుతాడు.ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి హిట్ మ్యాన్ 470 మ్యాచ్‌ల్లో 593 సిక్సర్లు కొట్టగా ఇందులో వన్డేల్లో 323, టీ20ల్లో 190 ,టెస్ట్‌ల్లో 80 సిక్స్‌లున్నాయి.

 

 

ఇక ఈ మ్యాచ్‌లో మరో 23 రన్స్ చేస్తే టెస్ట్‌ల్లో 4000 పరుగులు మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనతను అదుకున్న 17వ ఇండియన్ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. మరో 13 రన్స్ చేస్తే ఇంగ్లండ్‌పై టెస్ట్‌ల్లో 1000 రన్స్ పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 16వ ఇండియా బ్యాటర్‌గా గుర్తింపు పొందుతాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంతో ఉంది.

 

 

 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, యశస్వి జైస్వాల్,సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా,దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్,అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, ఆకాశ్ దీప్

Read more RELATED
Recommended to you

Exit mobile version