రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. అందుకేనా..?

-

ఉక్రెయిన్- రష్యా యుద్ధ పరిణామాల మధ్య ఈరోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధ పరిస్థితులపై గత నెల25న కూడా రష్యా అధ్యక్షుడితో మోదీ మాట్లాడారు. భారతీయ విద్యార్థులను తరలించేందుకు సహకరించాలని.. రష్యాను కోరారు. మరోసారి పుతిన్ తో సంభాషించనున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయును స్వదేశానికి తీసుకురావడానికి సహకరించింది రష్యా. మరో వైపు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ కూడా భారతీయ విద్యార్థులు బోర్డర్ దాటేందుకు సహకరించింది. 

ఇదిలా ఉంటే ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఇప్పటికే పలుమార్లు యుద్ధాన్ని ఆపేసేలా రష్యాపై ఒత్తడి తేవాలంటూ.. ఉక్రెయిన్ ప్రధాని జెలెన్ స్కీతో పాటు ఆదేశ విదేశాంగ మంత్రి కుబేలా, భారత్ లో ఆదేశ రాయబారి ఇగోర్ పొలిఖా ప్రధాని మోదీని అభ్యర్థించారు. ఈ దశలో ఒకే రోజు ఇటు ఉక్రెయన్ అధ్యక్షుడితో.. ఇటు రష్యా అధ్యక్షుడితో ప్రధాని మాట్లాడనున్నారు. యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించే అవకాశం ఉంది. ఇదే విధంగా ఇంకా ఉక్రెయన్ లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు ఇరు దేశాల సాయం కోరే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news