టీడీపీ కి సాయి రెడ్డి కొత్త డెఫినిష‌న్.. మామూలుగా లేదుగా ..

-

వివాదాలు సాయిరెడ్డికి కొత్త కావు. నిర్వ‌చ‌నాలు ఇవ్వ‌డం కూడా ఆయ‌న కొత్త కాదు. మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో  ఎవ‌రికి వారు త‌మని తాము గొప్ప‌గా చూపించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఆ విధంగా నాయ‌కులు త‌మని తాము నిరూపించుకునేందుకు తాప‌త్ర‌య ప‌డుతున్నారు.  మ‌హానాడు నేప‌థ్యంలో అటు వైసీపీ ఇటు టీడీపీ మాట‌ల యుద్ధంలో కొన్ని కొత్త  నిర్వ‌చ‌నాలు దొర్లాయి. వాగ్వాదాలూ ఆరంభం అయ్యాయి.

అంద‌రి బాధ‌లోనూ మార్పులు వ‌చ్చేయి. అంద‌రి భాష‌లోనూ మార్పులు వ‌చ్చేయి. ఒక‌ప్పుడు క‌న్నా ఇప్పుడు భాష అస్స‌లు బాలేదు అని అన్నామే అనుకోండి అటు టీడీపీ, ఇటు వైసీపీ క‌త్తులు ప‌ట్టుకుని యుద్ధానికి దిగిపోతాయి. ఆ విధంగా ఆ రెండు పార్టీల వ్య‌వ‌హార శైలి ఉంది. ఇప్పుడు టీడీపీ భాష కూడా మారిపోయింది. అమ్మాయిలు కూడా రాయ‌లేని భాష‌లో మాట్లాడుతున్నారు. ఇదే సంద‌ర్భంలో వైసీపీ సాయిరెడ్డి కౌంట‌ర్లు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.

ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న చేసే కామెంట్లు త‌రుచూ ట్రోల్ అవుతున్నాయి. వైసీపీ త‌ర‌ఫున ట్విట‌ర్ లో కౌంట‌ర్ ఇచ్చే ఏకైక నాయ‌కుడు సాయిరెడ్డే క‌నుక ఆయ‌న కూడా త‌న స్వ‌రం పెంచే మాట్లాడుతూ కొత్త వివాదాల‌కు కొత్త వ్యూహాల‌ను జ‌త చేస్తూ వ‌స్తున్నారు. ఆ విధంగా పొలిటిక‌ల్ మైలేజ్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఆంధ్రావ‌నిలో ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా గెలుపు మాదే అన్న ధీమాలో పార్టీలు ఉన్నాయి. ఆ విధంగా ఎవ‌రి వ్యూహాలు వారికి ఉన్నాయి. కొన్ని సార్లు శ్రుతి మించి వ్యాఖ్య‌లు చేస్తూ వివాదాలు తెచ్చుకుంటున్నాయి. వాటిని నిలువ‌రించ‌లేక త‌రువాత అవ‌స్థ‌లు ప‌డుతున్నాయి. మాట జాగ్రత్త అన్న‌ది అస్స‌లు పాటింపులో లేదు. అటు అధికార పార్టీ అయినా ఇటు విప‌క్షం అయినా త‌మ‌కు సంబంధించిన వ‌ర‌కూ మాట్లాడితే చాలు. అలా కాకుండా హెచ్చు స్వ‌రంతో  తీవ్ర స్థాయి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, తిట్లు, వాటి స్థాయి కూడా దాటిపోయి ఏవేవో రాయ‌లేని భాష‌లో మాట‌లు ఇవ‌న్నీ అన్నింటా ఉన్నాయి. మ‌హానాడులో కూడా ఉన్నాయి.ఓ విధంగా మ‌హానాడు నేప‌థ్యంలో టీడీపీ హుషారుగా ఉంది. మ‌హానాడు అనుకున్న దాని క‌న్నా ఎక్కువ విజ‌యం అందుకోవ‌డంతో టీడీపీ ఇంకాస్త జోరుగా ఉంది. ఇదే సంద‌ర్భంలో వైసీపీపై వ్యాఖ్య‌లు చేస్తూ ఉంది. సెటైర్లు వేస్తూ ఉంది. రానున్న కాలంలో అధికారం త‌మ‌దే అని చెబుతూ ఉంది. ఎవ‌రి విశ్వాసం వారిది. ఎవ‌రి న‌మ్మ‌కం వారిది. గెలుపు అన్న‌ది ఒక‌రి ఇంటికి ప‌రిమితం కాదు. క‌నుక ఈసారి ఏమ‌యినా జ‌ర‌గొచ్చు. ప‌రిణామాలు మార్చొచ్చు ఓట‌రు. ఈ లోగా అధికార‌, విప‌క్ష పార్టీలు మాట‌ల యుద్ధం అయితే ఆపేలా లేవు. త్వ‌ర‌లో మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న సాయిరెడ్డి గొంతు పెంచారు. మ‌హానాడు నేప‌థ్యంలో స్పందించారు. టీడీపీ అంటే 2024 లో తూర్పు తిరిగి దండం పెట్టుకోవ‌డ‌మే అని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేమ‌న్న మ‌నో వేద‌న ఈ మ‌హానాడులో క‌నిపిస్తుంద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news