జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కళ్యాన్ అసలు సిసలైన రూపం, ఈ రోజు బయట పడిందని అన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్, ఒకసారి కాదు వంద సార్లు అంటానని అన్నారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కి లేదన్నారు.
ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని హింసించినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు అంబటి రాంబాబు. జనసెనికులకు హెచ్చరిక… కుక్క తోక పట్టుకొని గోదారి ఈదకండని అన్నారు. చివరికి నువ్వు చూపించే “చెప్పే” నీ పార్టీ సింబల్ అవుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.