సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కాసేపట్లోనే ప్రకటన !

-

సిద్దిపేట కలెక్టర్ వెంకట రామి రెడ్డి… కాసేపటి క్రితమే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 26 సంవత్సరాలకు పైగా ఐఏఎస్ హోదాలో వెంకటరామిరెడ్డి పనిచేశారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. అయితే రాజీనామా చేసిన సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి.. తదుపరి కార్యాచరణ ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు.

అయితే ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని సమాచారం అందుతోంది. ఇవాళ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో వెంకటరామిరెడ్డి చేరే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అంతే కాదు ఇవాళ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే.. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో వెంకట రామిరెడ్డి పేరు ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే కోటా లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కని ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం హామీ ఇవ్వడంతో పదవికి రాజీనామా చేశారని… పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై మరి కొన్ని గంటలలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version