సామాజిక తెలంగాణే కాంగ్రెస్ లక్ష్యం – రేవంత్ రెడ్డి

-

సామాజిక తెలంగాణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ లోని లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక లింబాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

స్వయంపాలనతో కూడిన సామాజిక తెలంగాణే కాంగ్రెస్ లక్ష్యం అని అన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు రేవంత్ రెడ్డి. పార్టీకి నష్టం జరిగినా తెలంగాణ ఇచ్చారని.. కానీ తెలంగాణ వచ్చినప్పటికీ ప్రజల కష్టాలు తీరలేదన్నారు. తెలంగాణ తల్లికి విముక్తి కలిగించేందుకే ఈ యాత్ర చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version